ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాలు.. నవంబర్ 6 నుంచి దరఖాస్తులు

APPSC Recruitment 2026 : ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాలపై ఏపీపీఎస్సీ అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 6 నుంచి పలు పోస్టులకు దరఖాస్తులు మెుదలుకానున్నాయి.

Published on: Oct 15, 2026, 10:06:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగార్ధులు, ముఖ్యంగా సైన్స్, ఫార్మసీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) శుభవార్త అందించింది. ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబోర్డినేట్ సర్వీస్‌లో అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఏపీపీఎస్సీ ఉద్యోగాలు
ఏపీపీఎస్సీ ఉద్యోగాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 06, 2026 నుండి నవంబర్ 26, 2026 రాత్రి 11:59 గంటల వరకు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు 9 ఉన్నాయి. జీతం స్కేల్ రూ. 40,970 నుండి రూ. 1,24,380 వరకు ఉంటుంది. దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్ మోడ్ మాత్రమే ఉంటుందని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in ద్వారా అప్లై చేయాలి. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం నవంబర్ 6 నుంచి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 26గా నిర్ణయించారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ తేదీ నాటికి ప్రభుత్వం లేదా యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కెమిస్ట్రీ సబ్జెక్ట్‌తో బి.ఎస్సీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా బి.ఎస్సీ ఫార్మసీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి.

కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు ఉండాలి. వయోపరిమితిని 01 జూలై 2026 ప్రాతిపదికన చూస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ నియామక ప్రక్రియలో ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. వచ్చిన దరఖాస్తుల సంఖ్యతో సంబంధం లేకుండా కేవలం ఒకే దశ రాత పరీక్ష మాత్రమే నిర్వహిస్తారు. ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా నిర్వహించనున్నారు. ఒకవేళ పరీక్షను బహుళ సెషన్లలో నిర్వహిస్తే, మార్కుల నార్మలైజేషన్ పద్ధతిని వర్తింపజేస్తారు. రాత పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కట్ అవుతాయి. రాత పరీక్ష డిగ్రీ ప్రామాణికంలో మొత్తం 300 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. అర్హులైన అభ్యర్థులకు క్వాలిఫైయింగ్ స్వభావంతో కూడిన కంప్యూటర్ ప్రాఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.

అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించే ముందు కమిషన్ వెబ్‌సైట్ https://psc.ap.gov.in ద్వారా తమ వివరాలను సరి చూసుకోవాలి. దరఖాస్తును కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు, ఇతర మార్గాల్లో పంపిన అప్లికేషన్లు తిరస్కరిస్తారు. చివరి నిమిషంలో వెబ్‌సైట్ రద్దీ వల్ల ఇబ్బందులు పడకుండా, అభ్యర్థులు గడువు ముగియడానికి ముందే అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More