AP BC Reservation : స్థానిక ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లు - ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. స్థానిక పోరులో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

జోక్యం చేసుకోలేం - సుప్రీంకోర్టు
జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ హైకోర్టు అత్యంత సహేతుకమైన ఉత్తర్వులను వెలువరించిందని…. అందులో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.డెడికేటెడ్ కమిషన్ నివేదికను అమలు చేస్తున్నట్లు ఎక్కడుందని వ్యాఖ్యానించింది.
34 శాతం కోటాతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటుతున్నాయంటూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు ఇటీవల కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం నిరాకరించింది.
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక…. ఆగస్టు 18న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు 34 శాతం కోటా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో బీసీలకు నామినేటెడ్ పదవులతో పాటు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా పేర్కొన్నారు.
అయితే రాజ్యాంగబద్ధంగా 50 శాతం రిజర్వేషన్ల పరిమితి దాటుతుండటంతో హైకోర్టు దీనిని రద్దు చేయగా…. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియపై మళ్లీ అనిశ్చితి ఏర్పడింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 50 శాతం పరిమితికి లోబడే రిజర్వేషన్లు ఖరారు చేసి స్థానిక ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

