APRJC CET 2026 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - ఏపీ ఆర్‌జేసీ సెట్ దరఖాస్తులకు రేపే లాస్ట్ డేట్
APRJC Admissions 2026 : ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు APRJC నోటిఫికేషన్ జారీ అయింది. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తులు కొనసాగుతున్నాయి. ఈ గడువు రేపటితో పూర్తి కానుంది.
రాష్ట్రంలోని 10 గురుకుల జూనియర్ కళాశాలల్లో(APRJC 2026) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు ఏప్రిల్ 7వ తేదీతో పూర్తి కానుంది. అర్హులైన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుంది. అంతేకాకుండా సీట్లు పొందే వారికి ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు.
దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్ 24వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ గ్రూపుల్లో చేరవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,425 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. విద్యార్థులు ఎంపిక చేసుకునే గ్రూప్ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు. పదో తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి.
దరఖాస్తు విధానం ఇలా:
- ముందుగా https://aprs.apcfss.in/dashboard వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని APRJC 2026 లింక్ పై క్లిక్ చేయాలి.
- పేమెంట్ ఆప్షన్ పై నొక్కి ఫీజును చెల్లించాలి.
- ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. విద్యార్థి వివరాలను నమోదు చేయాలి
- చివరగా సబ్మిట్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.
- రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఏప్రిల్ 15వ తేదీ జారీ అవుతాయి. ఏప్రిల్ 24వ తేదీన ఎగ్జామ్ నిర్వహిస్తారు. మే 15వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో విద్యార్థులు సాధించిన మార్కులు, రిజర్వేషన్, స్పెషల్ కేటగిరీ, స్థానికత ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. కౌన్సెలింగ్ ప్రాసెస్ ద్వారా సీట్లను భర్తీ చేస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

