...
...
Next Story

ఏపీపై ద్రోణి ఎఫెక్ట్ - పిడుగులతో కూడిన భారీ వర్ష సూచన! ఈ జిల్లాలకు హెచ్చరికలు

AP Weather Updates 2026 : ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలను జారీ చేసింది.

Published on: Jun 26, 2026, 17:47:48 IST
Advertisement

AP Weather Updates 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలో ఏర్పడిన వాతావరణ ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని…. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఈ జిల్లాలకు వర్ష సూచన….

ద్రోణి ప్రభావం - ఏపీకి వర్ష సూచన (image source APSDMA)
ద్రోణి ప్రభావం - ఏపీకి వర్ష సూచన (image source APSDMA)

ద్రోణి ప్రభావంతో శనివారం(జూన్ 27) ఉత్తరాంధ్ర పరిధిలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ చల్లటి గాలులతో కూడిన తేలికపాటి జల్లులు కురుసే సూచనలున్నాయి.

ఆదివారం నాటికి వర్షాల ప్రభావం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉంది. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.

వర్షాలు, ఈదురు గాలులు వచ్చే సమయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, హోర్డింగ్స్ (ప్రకటనల బోర్డులు), పాత గోడల కింద నిలబడకూడదని హెచ్చరించారు. ముఖ్యంగా పొలాల్లో ఉండే రైతులు, పశువులను మేపే కాపరులు పిడుగుల బారిన పడకుండా ఉండటానికి ఉరుములు రాగానే సురక్షితమైన శాశ్వత కట్టడాల లోపలికి వెళ్లాలని సూచించారు. రోడ్లపై తెగిపడిన విద్యుత్ వైర్లు ఉంటే వాటికి దూరంగా ఉండాలని…. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe