...
...
Next Story

APSDMA Recruitment 2026 : ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - నెలకు రూ.61 వేల జీతం, ముఖ్య వివరాలు

APSDMA Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కాంట్రాక్ట్ ప్రాతిపదికన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది . బీటెక్ అర్హత, ఐదేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు జూలై 20 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Jul 11, 2026, 17:59:32 IST
Advertisement

APSDMA Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి రిక్రూట్ మెంట్ అప్డేట్ వచ్చింది. సంస్థలో ఖాళీగా ఉన్న సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టును కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ కాంట్రాక్టు గడువును ఎప్పటికప్పుడు పొడిగించే అవకాశం ఉంటుంది.

పోస్టు వివరాలు, అర్హతలు

ఏపీ విపత్తు నిర్వహణ సంస్థలో ఉద్యోగం
ఏపీ విపత్తు నిర్వహణ సంస్థలో ఉద్యోగం

నోటిఫికేషన్ ద్వారా ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టును భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.61,500 చొప్పున వేతనం అందిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 45 ఏళ్ల లోపు ఉండాలి.

  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE) లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగాల్లో కనీసం 65 శాతం మార్కులతో బీటెక్ లేదా బీఈ పూర్తి చేసిన వారు ఈ పోస్టుకు అర్హులు.
  • విద్యార్హతలతో పాటు అభ్యర్థులకు సిసిఎన్‌ఏ (CCNA) సర్టిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి. సిసిఎన్‌పి (CCNP) సర్టిఫికేషన్ ఉన్నవారికి అదనపు ప్రాధాన్యం ఇస్తారు. వీటితో పాటు పైథాన్, సి, షెల్ స్క్రిప్టింగ్ (Python, C, shell scripting) వంటి ప్రోగ్రామింగ్ భాషలపై పట్టు ఉండాలి.
  • ఏదైనా గుర్తింపు పొందిన రాష్ట్ర లేదా జాతీయ స్థాయి సంస్థల్లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా కనీసం 5 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండటం తప్పనిసరి.

ఎంపికైన అభ్యర్థులు ఏపీఎస్డీఎంఏ నెట్‌వర్క్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఎల్‌ఏఎన్/డబ్ల్యూఏఎన్ (LAN/WAN), రూటర్లు, స్విచ్‌లు, ఫైర్‌వాల్స్, వీపీఎన్, వై-ఫై కాన్ఫిగరేషన్ మరియు ట్రబుల్‌షూటింగ్ చేయాలి. విండోస్, లైనక్స్ సర్వర్ల ఇన్‌స్టాలేషన్, డేటా బ్యాకప్, విపత్తు నిర్వహణ సమయంలో 24 గంటల పాటు ఐటీ సపోర్ట్ అందించడం, వివిధ విభాగాల నుంచి వచ్చే డేటాను అనుసంధానించడం వంటి కీలక బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం…

పూర్తి చేసిన దరఖాస్తు కవరుపై ఎడమ వైపు పైభాగంలో "Application for the post of System Administrator" అని స్పష్టంగా రాయాలి. ఈ దరఖాస్తును కేవలం 'స్పీడ్ పోస్ట్' ద్వారా మాత్రమే మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, రెవెన్యూ (డిఎం) శాఖ, డోర్ నెం: 21/2B, ఎన్‌హెచ్-16, కుంచనపల్లి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా, పిన్ కోడ్: 522501 అనే చిరునామాకు పంపాలి.

దరఖాస్తులు సమర్పించడానికి 2026 జూలై 20 సాయంత్రం 5:00 గంటల వరకు గడువు ఉంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ, సమయాన్ని సమాచారం అందిస్తారు. ఇంటర్వ్యూకి హాజరయ్యే సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్లను వెంట తీసుకురావాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks