IDBI Bank SO Recruitment : ఐడీబీఐ బ్యాంక్​లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు- అర్హత, దరఖాస్తు వివరాలు ఇవే..

IDBI Bank recruitment 2026 apply online : ఐడీబీఐ బ్యాంక్ దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 14 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Jul 11, 2026, 05:55:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ముఖ్యమైన వార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్.. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో మొత్తం 31 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఐడీబీఐ బ్యాంక్ ఎస్​ఓ రిక్రూట్​మెంట్​ 2026 అప్డేట్స్.. (Mint)
ఐడీబీఐ బ్యాంక్ ఎస్​ఓ రిక్రూట్​మెంట్​ 2026 అప్డేట్స్.. (Mint)

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 14, 2026 నుంచి ప్రారంభం కానుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జులై 26, 2026లోగా తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ idbi.bank.in సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐడీబీఐ బ్యాంక్ ఎస్​ఓ రిక్రూట్​మెంట్​ 2026- విభాగాల వారీగా ఖాళీల వివరాలు..

రిక్రూట్‌మెంట్‌లో భాగంగా డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం), మేనేజర్ వంటి వివిధ కేడర్లలో కింద పేర్కొన్న నాలుగు ప్రధాన విభాగాల్లో నియామకాలు జరుపుతారు:

ఆడిట్ – ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఎస్): 10 పోస్టులు

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ - ప్రెమిసెస్: 8 పోస్టులు

లీగల్ (న్యాయ విభాగం): 9 పోస్టులు

సెక్యూరిటీ ఆఫీసర్: 4 పోస్టులు

ఐడీబీఐ బ్యాంక్ ఎస్​ఓ రిక్రూట్​మెంట్​ 2026- అర్హత ప్రమాణాలు..

ఐడీబీఐ బ్యాంక్ ఎస్​ఓ రిక్రూట్​మెంట్​ 2026 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి, విద్యా అర్హతలు, పని అనుభవం వంటి వివరాలను ఐడీబీఐ బ్యాంక్ విడుదల చేసిన సుదీర్ఘ అధికారిక నోటిఫికేషన్‌లో తనిఖీ చేసుకోవచ్చు. దరఖాస్తుదారు సమర్పించిన వివరాల ఆధారంగానే ప్రాథమిక పరిశీలన ఉంటుంది.

ఐడీబీఐ బ్యాంక్ ఎస్​ఓ రిక్రూట్​మెంట్​ 2026- ఎంపిక ప్రక్రియ..

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పలు దశల్లో సాగుతుంది. అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్‌లో పేర్కొన్న వయస్సు, విద్యా అర్హతలు, పని అనుభవం ఆధారంగా ముందుగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ (ప్రాథమిక స్క్రీనింగ్) చేస్తారు.

"షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ జరిగే వేదిక, సమయం, తేదీ వివరాలను వారి రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా ఎస్ఎమ్ఎస్ ద్వారా హాల్ టికెట్ రూపంలో పంపించడం జరుగుతుంది," అని బ్యాంక్ యాజమాన్యం స్పష్టం చేసింది.

పరీక్షా కేంద్రం లేదా సమయాన్ని మార్చాలనే అభ్యర్థనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు అని గుర్తుపెట్టుకోవాలి.

ప్రాథమిక పరిశీలన అనంతరం ఎంపిక ప్రక్రియలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, గ్రూప్ డిస్కషన్ / లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి. వీటితో పాటు ప్రీ-రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. బ్యాంక్ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షల్లో అర్హత సాధించడం తప్పనిసరి.

ఐడీబీఐ బ్యాంక్ ఎస్​ఓ రిక్రూట్​మెంట్​ 2026- దరఖాస్తు రుసుము..

ఐడీబీఐ బ్యాంక్ ఎస్​ఓ రిక్రూట్​మెంట్​ 2026 కోసం అభ్యర్థులు తమ కేటగిరీని బట్టి నిర్ణీత దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది:

ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 250/- గా నిర్ణయించారు.

జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ. 1050/- చెల్లించాల్సి ఉంటుంది.

ఈ రుసుమును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా వాలెట్ల ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఆన్‌లైన్ పేమెంట్ సమయంలో పడే అదనపు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జీలను అభ్యర్థులే భరించాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండాలి.

ఐడీబీఐ బ్యాంక్ ఎస్​ఓ రిక్రూట్​మెంట్​ 2026 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More