AP Police Recruitment 2026 : నిరుద్యోగులకు శుభవార్త - SI, కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల, ఖాళీలు ఎన్నంటే..?

AP Police Recruitment 2026 : పోలీస్ శాఖలో 2,050 ఉద్యోగాల భర్తీకి ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Sep 16, 2026, 09:22:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Police Recruitment 2026 : పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ తదితర కీలక విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. 2026 జాబ్ క్యాలెండర్‌లో భాగంగా ఈ భారీ నియామక ప్రక్రియను చేపడుతున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APSLPRB)…. మొత్తం 2,050 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసింది.

పోలీస్ ఉద్యోగాలు - నోటిఫికేషన్లు విడుదల
పోలీస్ ఉద్యోగాలు - నోటిఫికేషన్లు విడుదల

మొత్తం 2,050 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రాగా… ఇందులో 438 సబ్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. సివిల్ విభాగంలో 253, ఆర్మ్‌డ్ రిజర్వ్‌లో 116, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 9, కమ్యూనికేషన్స్‌లో 50, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో 10 ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి.

ఇక 1,156 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో సివిల్ కానిస్టేబుల్స్ 542, ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ 285, ఫైర్ అండ్ ప్రిజన్స్ విభాగాలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

  • సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులు: మొత్తం 438 ఎస్‌ఐ పోస్టులను విభిన్న విభాగాల్లో భర్తీ చేయనున్నారు.
  • కానిస్టేబుల్ స్థాయిలో సివిల్, ఏఆర్, ఫైర్, జైళ్ల విభాగాల్లో కలిపి మొత్తం 1,156 పోస్టులను ఖరారు చేశారు.
  • ప్రత్యేక కానిస్టేబుల్ విభాగంలో 413 పోస్టులను భర్తీ చేస్తారు.
  • ఫొరెన్సిక్ విభాగంలో అర్హులైన నిపుణుల కోసం 43 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను ప్రకటించారు. అందులో ఫిజికల్ విభాగంలో 10, కెమికల్ విభాగంలో 13, బయోలాజికల్/సెరోలజీ విభాగంలో 20 పోస్టులు ఉన్నాయి.

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ( https://slprb.ap.gov.in/ ) ద్వారా మాత్రమే ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ ప్రారంభ తేదీలు, ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్‌లో పేర్కొన్న వయోపరిమితి, విద్యార్హతలు మరియు ఇతర శారీరక ప్రమాణాల వివరాలను క్షుణ్ణంగా సరిచూసుకోవాలని సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More