CRPF Recruitment 2026 : అలర్ట్- సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాల దరఖాస్తుకు ఇంకొన్ని గంటలే ఛాన్స్..

సీఆర్​పీఎఫ్​లో 9,195 కానిస్టేబుల్ (టెక్నికల్ అండ్ ట్రేడ్స్‌మెన్, పయనీర్) పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారం (మే 19, 2026) ఆఖరి రోజు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు నేటి అర్ధరాత్రిలోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Published on: May 19, 2026, 12:18:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

CRPF Recruitment 2026 online apply date : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ముఖ్య గమనిక. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్​పీఎఫ్) లో భారీ సంఖ్యలో ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విండో నేటితో (మే 19, 2026) ముగియనుంది. దేశవ్యాప్తంగా మొత్తం 9,195 కానిస్టేబుల్ (టెక్నికల్ అండ్ ట్రేడ్స్‌మెన్, పయనీర్) ఖాళీలను భర్తీ చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 20, 2026 న ఈ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నేటితో గడువు ముగుస్తున్నందున అర్హులైన అభ్యర్థులు వెంటనే తమ అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది.

సీఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​ రిజిస్ట్రేషన్ 2026 అప్డేట్స్.. (Savitha)
సీఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​ రిజిస్ట్రేషన్ 2026 అప్డేట్స్.. (Savitha)

సీఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​ రిజిస్ట్రేషన్ 2026- దరఖాస్తు విధానం, ఫీజు..

అర్హత గల భారతీయ పౌరులు (పురుషులు, మహిళలు) సీఆర్‌పీఎఫ్ అధికారిక వెబ్‌సైట్ crpf.gov.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి పోస్టుకు అప్లికేషన్ ఫీజుగా రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ఈ రిక్రూట్‌మెంట్ పూర్తిగా అభ్యర్థి నివాస ధృవీకరణ పత్రం ఆధారంగా ఓపెన్ కాంపిటీటివ్ ఎగ్జామ్ నిర్వహిస్తామని సీఆర్​పీఎఫ్​ తన ప్రకటనలో పేర్కొంది.

సీఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​ రిజిస్ట్రేషన్ 2026- మొత్తం ఖాళీల వివరాలు..

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన నిబంధనల ప్రకారం మొత్తం 9,195 ఖాళీలను కింది విధంగా కేటాయించారు.

కానిస్టేబుల్ (టెక్నికల్ అండ్ ట్రేడ్స్‌మెన్): మొత్తం 9,175 ఖాళీలు

పురుషులు: 9,096

మహిళలు: 79

పయనీర్ వింగ్ : 20 ఖాళీలు (కేవలం పురుషులకు మాత్రమే)

సీఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​ రిజిస్ట్రేషన్ 2026- ఎంపిక విధానం..

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో కింది దశలు ఉంటాయి:

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)

శారీరక సామర్థ్య పరీక్ష (పీఈటీ)

శారీరక ప్రమాణాల పరీక్ష (పీఎస్​టీ)

ట్రేడ్ టెస్ట్

డాక్యుమెంట్ వెరిఫికేషన్

వైద్య పరీక్షలు

సీఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​ రిజిస్ట్రేషన్ 2026- పరీక్షా విధానం, అడ్మిట్ కార్డ్ సమాచారం..

ఈ పోస్టుల కోసం నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) కేవలం ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. పరీక్షకు కనీసం ఒక వారం ముందు సీఆర్‌పీఎఫ్ వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సీఆర్‌పీఎఫ్ అడ్మిట్ కార్డ్ 2026, రెండు కలర్ ప్రింటౌట్లను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More