ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) సిద్ధమైంది. విమానాశ్రయానికి మెరుగైన ప్రజా రవాణా సదుపాయం కల్పించే లక్ష్యంతో ఆగస్టు 1న 20 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నట్లు విశాఖపట్నం ఏపీఎస్‌ఆర్‌టీసీ రీజినల్ మేనేజర్ బి.అప్పల నాయుడు వెల్లడించారు.

ఈ పథకం ప్రారంభానికి సంబంధించి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే 7 విద్యుత్ బస్సులు విశాఖ నగరానికి చేరుకోగా, మిగిలిన 13 బస్సులు జూలై 25 నాటికి రానున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్ట్ అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ఈ-బస్సులను ప్రారంభించనున్నారు.
ప్రయాణికులకు సులభమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఆర్టీసీ రెండు ప్రత్యేక రూట్లను ఖరారు చేసింది:
రూట్ 1: గాజువాక – ఎన్‌ఏడీ (NAD) – భోగాపురం మార్గంలో 10 బస్సులు.
రూట్ 2: సింధియా – రైల్వే స్టేషన్ – రుషికొండ – భోగాపురం మార్గంలో 10 బస్సులు.
డిపోలో వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ, సాంకేతిక అవగాహన కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. భోగాపురం సైట్‌లో ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సిబ్బంది విశ్రాంతి గదులు ఇప్పటికే సిద్ధమయ్యాయి. దీనికి అదనంగా ద్వారకా బస్ స్టేషన్, మద్దిలపాలెం, చోడవరం, కొత్తవలస, ఎలమంచిలి ప్రాంతాల్లో కూడా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును వేగవంతం చేస్తున్నారు. మరో 80 ఎలక్ట్రిక్ బస్సులు అక్టోబర్ నెలాఖరు నాటికి ఆర్టీసీ ఫ్లీట్‌లో చేరనున్నాయని అధికారులు తెలిపారు.
విజయనగరం జిల్లాలోని అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్‌లతో కలిసి ప్రధానమంత్రి పర్యటన, ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
{{/usCountry}}విజయనగరం జిల్లాలోని అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్‌లతో కలిసి ప్రధానమంత్రి పర్యటన, ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
{{/usCountry}}కార్యక్రమం సజావుగా జరిగేందుకు శాఖల మధ్య సరైన సమన్వయం ఉండేలా చూడాలని హోం మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు ఉత్తరాంధ్ర సంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శించే జానపద కళా ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రారంభోత్సవం, బహిరంగ సభ కోసం విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 60 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తుండగా, సుమారు 3,000 వాహనాల కోసం పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. జనసమూహం, ట్రాఫిక్ నిర్వహణను సమర్థవంతంగా చేసేందుకు భద్రతా ఏర్పాట్లను నాలుగు విభాగాలుగా విభజించారు.