...
...
Next Story

APSRTC : ఈ తేదీ నుంచి దివ్యాంగులకు ఫ్రీ బస్.. వారి సహాయకులకు 50 శాతం డిస్కౌంట్

APSRTC : ఇంద్ర ధనుస్సులో భాగంగా దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తోంది. అంతేకాదు వారితో వచ్చే సహాయకులకు టికెట్ ఛార్జీలో 50 శాతం డిస్కౌంట్ ఉంటుంది.

Published on: Mar 5, 2026, 05:55:48 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం, సామాజిక చేరికను బలోపేతం చేయడానికి 'ఇంద్ర ధనస్సు' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ చొరవలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది.

ఏపీఎస్ఆర్టీసీ
ఏపీఎస్ఆర్టీసీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి 18, 2026న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేస్తారు. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న RPWD చట్టం, 2016లోని సెక్షన్ 2 (ZC) కింద ఉన్న అర్హత కలిగిన అన్ని పీడబ్ల్యూడిలకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని విస్తరింపజేస్తామని ఏపీఎస్ఆర్టీసీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ సౌకర్యం ఐదు కేటగిరీల ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులలో అందుబాటులో ఉంటుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. దివ్యాంగులతోపాటుగా అర్హత కలిగిన సహాయకుడికి ఈ కేటగిరీల బస్సులలో 50 శాతం రాయితీ అందిస్తారు.

దివ్యాంగులకు సౌకర్యవంతమైన, గౌరవప్రదమైన ప్రజా రవాణా సేవలను అందించడం ద్వారా వారి సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం ఈ చొరవ లక్ష్యం అని ప్రకటనలో తెలిపింది. ఈ ఉచిత బస్సు ప్రయాణంపై దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అర్హత కలిగిన లబ్ధిదారులు రాష్ట్రవ్యాప్తంగా అనేక APSRTC బస్సు కేటగిరీలలో ఉచితంగా ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది. ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ద్వారా అమలు చేస్తారు. మార్చి 18న అధికారికంగా కార్యక్రమం ప్రారంభం అవుతుంది.

ఇంద్రధనుస్సు కార్యక్రమం వికలాంగుల మెుబిలిటీ మెరుగుపరచడానికి, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి, సామాజిక అవకాశాలను మరింత సులభంగా పొందడంలో వారికి సహాయపడటానికి రూపొందించబడిందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అంతటా వికలాంగులకు సమగ్ర అభివృద్ధి, గౌరవప్రదమైన ప్రజా సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో ఈ పథకం భాగం.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe