కార్తీక మాసంలో అరుణాచల క్షేత్ర దర్శనానికి వెళ్లే శివ భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించే కార్తీక మహాదీపం ఉత్సవాలు-2026 సందర్భంగా భక్తుల రాకపోకల సౌకర్యార్థం కాకినాడ, రాజోలు ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఈ ఏడాది అరుణాచలంలో కార్తీక దీపోత్సవాలు నవంబర్ 12వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో అత్యంత కీలకమైన పౌర్ణమి మహోత్సవం, గిరిప్రదక్షిణ సమయాల్లో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంటుంది.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నవంబర్ 22 నుంచి నవంబర్ 26 వరకు రాజోలు, కాకినాడ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. రాజోలు డిపో మేనేజర్ మురళి అలాగే కాకినాడ డిపో మేనేజర్ జీఆర్ లక్ష్మీదేవి ఈ ప్రత్యేక సర్వీసులకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించారు.
కార్తీక పౌర్ణమి వేళ తిరువణ్ణామలై కొండ (అరుణాచల గిరి) చుట్టూ సుమారు 14 కిలోమీటర్ల మేర నడిచి గిరిప్రదక్షిణ చేయడం అత్యంత పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షలాది మంది భక్తులు తమిళనాడుకు తరలివెళ్తుంటారు.
భక్తులు ప్రయాణ సమయాల్లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ apsrtconline.in ద్వారా లేదా స్థానిక ఆర్టీసీ బస్టాండ్లలోని రిజర్వేషన్ కౌంటర్లలో ముందస్తుగా సీట్లను రిజర్వ్ చేసుకోవచ్చు.
కాకినాడ డిపో నుంచి ప్రయాణించాలనుకునే భక్తులు సీట్ల రిజర్వేషన్, బస్సు వేళల పూర్తి వివరాల కోసం క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని డీఎం తెలిపారు. కాకినాడ డిపో సంప్రదించేందుకు ఈ నెంబర్లకు 7382910769, 7482910869 కాల్ చేయాలి.
{{/usCountry}}కాకినాడ డిపో నుంచి ప్రయాణించాలనుకునే భక్తులు సీట్ల రిజర్వేషన్, బస్సు వేళల పూర్తి వివరాల కోసం క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని డీఎం తెలిపారు. కాకినాడ డిపో సంప్రదించేందుకు ఈ నెంబర్లకు 7382910769, 7482910869 కాల్ చేయాలి.
{{/usCountry}}అరుణాచలేశ్వరుని దర్శనానికి వెళ్లే భక్తులందరూ ఈ ప్రత్యేక బస్సు సర్వీసుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. రాజోలు నుంచి వెళ్లేవారు బస్టాండ్లోనూ సంప్రదించవచ్చు.