TGSRTC-Metro Pass : ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలు భారీగా తగ్గింపు.. పాస్ ఎలా తీసుకోవాలి?

TGSRTC-Metro Pass : తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వాసులకు దీపావళి కానుకను ప్రకటించింది. ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈ కొత్త ధరలు నవంబర్ 8 నుంచి అమలులోకి వస్తాయి.

Updated on: Nov 6, 2026, 11:38:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హైదరాబాద్ నివాసితులకు, రోజువారీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన శుభవార్త అందించింది. నగరంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థను సామాన్యులకు మరింత అందుబాటులోకి తేవడం, ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా కామన్ ట్రావెల్ పాస్ ధరలను భారీగా తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్
హైదరాబాద్ మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్

హైదరాబాద్ మెట్రో రైల్, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) బస్సులలో ఒకే పాస్‌తో ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్న ఈ కామన్ పాస్ ధరలను దాదాపు సగానికి పైగా తగ్గించారు. ఈ వివరాలను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

డైలీ పాస్ ధర గతంలో రూ.400గా ఉండగా.. ప్రస్తుతం రూ.275కే అందుబాటులో ఉంటుంది. రూ.200 మెట్రో వాటా, రూ.75 ఆర్టీసీ వాట. మంత్లీ పాస్ ధరను రూ.8,500 నుంచి రూ.4,000కి తగ్గించారు. అంటే సగానికి పైగా ధర తగ్గింది. ఇందులో మెట్రో వాటా రూ.3,000, ఆర్టీసీ వాటా రూ.1,000గా ఉంది. ఈ నూతన సవరించిన ధరలు నవంబర్ 8 నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

నెలవారీ కామన్ ట్రావెల్ పాస్ వాడే ఉద్యోగులు, విద్యార్థులు ప్రతి నెల రూ.4,500 వరకు ప్రత్యక్షంగా ఆదా చేసుకోవచ్చు. డైలీ పాస్ వినియోగదారులు ప్రతిరోజూ రూ.125 ఆదా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ (మాదాపూర్, గచ్చిబౌలి), సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో నిత్యం లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు ప్రయాణిస్తుంటారు.

మెట్రో స్టేషన్ల నుంచి ఆఫీసులకు చేరుకోవడానికి ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఆర్‌టీసీ బస్సులపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ రెండు వ్యవస్థలను సమగ్రంగా అనుసంధానించేందుకు తీసుకొచ్చిన ఈ కామన్ పాస్ విధానం, ధరల తగ్గింపు వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయి. పాస్ ధరలు తగ్గడం వల్ల ద్విచక్ర వాహనాలు, కార్లలో వెళ్లేవారు ప్రజా రవాణ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

నగరంలో సొంత వాహనాల రద్దీ తగ్గి, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్‌లు తగ్గుతాయి. ప్రజారవాణాను ప్రోత్సహించడం ద్వారా కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది.

పాస్ ఎలా పొందాలి?

విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ పాస్ కౌంటర్లు, నిర్ణీత హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో ఈ కామన్ ట్రావెల్ పాస్‌లను కొనుగోలు చేయవచ్చు. త్వరలోనే క్యూఆర్ కోడ్, డిజిటల్ వ్యాలెట్ల ద్వారా కూడా ఫోన్‌లలోనే పాస్ బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More