కార్తీక మాసంలో అరుణాచలం వెళ్లేవారికోసం ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు

APSRTC Arunachalam Buses : కార్తీక మాసంలో అరుణాచలం వెళ్లేవారికోసం ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. శివయ్య దర్శనానికి స్పెషల్ బస్సులు నడుపుతోంది.

Published on: Nov 6, 2026, 13:18:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కార్తీక మాసంలో అరుణాచల క్షేత్ర దర్శనానికి వెళ్లే శివ భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించే కార్తీక మహాదీపం ఉత్సవాలు-2026 సందర్భంగా భక్తుల రాకపోకల సౌకర్యార్థం కాకినాడ, రాజోలు ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు.

అరుణాచలం (HT Telugu)
అరుణాచలం (HT Telugu)

ఈ ఏడాది అరుణాచలంలో కార్తీక దీపోత్సవాలు నవంబర్ 12వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో అత్యంత కీలకమైన పౌర్ణమి మహోత్సవం, గిరిప్రదక్షిణ సమయాల్లో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంటుంది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నవంబర్ 22 నుంచి నవంబర్ 26 వరకు రాజోలు, కాకినాడ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. రాజోలు డిపో మేనేజర్ మురళి అలాగే కాకినాడ డిపో మేనేజర్ జీఆర్ లక్ష్మీదేవి ఈ ప్రత్యేక సర్వీసులకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించారు.

కార్తీక పౌర్ణమి వేళ తిరువణ్ణామలై కొండ (అరుణాచల గిరి) చుట్టూ సుమారు 14 కిలోమీటర్ల మేర నడిచి గిరిప్రదక్షిణ చేయడం అత్యంత పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షలాది మంది భక్తులు తమిళనాడుకు తరలివెళ్తుంటారు.

భక్తులు ప్రయాణ సమయాల్లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ apsrtconline.in ద్వారా లేదా స్థానిక ఆర్టీసీ బస్టాండ్లలోని రిజర్వేషన్ కౌంటర్లలో ముందస్తుగా సీట్లను రిజర్వ్ చేసుకోవచ్చు.

కాకినాడ డిపో నుంచి ప్రయాణించాలనుకునే భక్తులు సీట్ల రిజర్వేషన్, బస్సు వేళల పూర్తి వివరాల కోసం క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని డీఎం తెలిపారు. కాకినాడ డిపో సంప్రదించేందుకు ఈ నెంబర్లకు 7382910769, 7482910869 కాల్ చేయాలి.

అరుణాచలేశ్వరుని దర్శనానికి వెళ్లే భక్తులందరూ ఈ ప్రత్యేక బస్సు సర్వీసుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. రాజోలు నుంచి వెళ్లేవారు బస్టాండ్‌లోనూ సంప్రదించవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More