...
...
Next Story

పీపీపీ మోడల్‌లో ఆరు బస్ స్టేషన్లను అభివృద్ధి చేయాలనుకుంటున్న ఏపీఎస్ఆర్టీసీ!

ఏపీఎస్ఆర్టీసీ పీపీపీ మోడల్‌లో పలు బస్ స్టేషన్లను అభివృద్ధి చేయాలని ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని పలువురు వ్యతిరేకిస్తుండగా.. మరికొందరు సమర్థిస్తున్నారు.

Published on: Jan 19, 2026 09:37 AM IST
Advertisement

ప్రయాణికులకు మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) రాష్ట్రవ్యాప్తంగా ఆరు ప్రధాన బస్ స్టేషన్లను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) మోడల్ కింద అభివృద్ధి చేయాలని ప్రతిపాదించిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నట్టుగా సమాచారం. మూడు నుండి ఐదు దశాబ్దాల వరకు ప్రభుత్వ ఆస్తులను పీపీపీ కింద ఇవ్వడం వల్ల కార్పొరేషన్ కూలిపోతుందని, ఆదాయం సంపాదించడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని, ఇబ్బందులు వస్తాయని ఉద్యోగులు అంటున్నారు.

ఏపీఎస్ఆర్టీసీ
ఏపీఎస్ఆర్టీసీ

ఈ పీపీపీ మోడల్ ప్రతిపాదిత ప్రాజెక్టులలో విజయవాడలోని ఆటోనగర్, కర్నూలులోని రాజ్‌విహార్, గుంటూరు, కడపలోని ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్స్, తిరుపతిలో ఆధునిక ఇంటర్‌మోడల్ స్టేషన్ నిర్మాణం, చిత్తూరులో బస్ స్టేషన్-కమ్-కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి. ఆరు ప్రాజెక్టుల మొత్తం అంచనా పెట్టుబడి రూ.958 కోట్లుగా ఉంది.

ఆరు ప్రాజెక్టులలో విజయవాడలోని ఆటోనగర్ ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ రూ. 154 కోట్ల అంచనా వ్యయంతో బిడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. రూ. 495 కోట్లతో నిర్ణయించిన తిరుపతి ఇంటర్‌మోడల్ స్టేషన్ వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను పూర్తి చేసింది. మిగిలిన నాలుగు ప్రాజెక్టులు ఇంకా డీపీఆర్ తయారీ దశలోనే ఉన్నాయి.

ఈ ఆరు ప్రాజెక్టులను డిజైన్ ఫైనాన్స్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్, బీఓటీ విత్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, బీఓటీ విత్ రెవెన్యూ షేరింగ్ మెకానిజమ్స్ వంటి విభిన్న పీపీపీ ఫార్మాట్‌ల కింద ప్లాన్ చేశారు. పీపీపీ మోడల్ కార్పొరేషన్‌ను పణంగా పెట్టి ప్రైవేట్ కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ బస్ స్టేషన్ల పునర్నిర్మాణానికి కార్పొరేషన్‌కు నేరుగా నిధులు ఇవ్వాలని యూనియన్లు కోరుతున్నాయి.

విజయవాడ బస్టాండ్ పునరుద్ధరణ తర్వాత వాణిజ్య ఆదాయం పెరిగిందని, ఇది నేరుగా కార్పొరేషన్‌కు వెళుతోంది. పీపీపీ మోడల్‌తో డబ్బు ప్రైవేట్ కంపెనీలకు వెళుతుందని, ఆర్టీసీకి కొద్దిపాటి వాటా చెల్లిస్తారని పలువురు చెబుతున్నారు. రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా పెట్టుబడులను సమీకరించడం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, వాణిజ్య సౌకర్యాలను ఏకీకృతం చేయడం పీపీపీ మోడల్ లక్ష్యంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

మరోవైపు పీపీపీ మోడల్ ద్వారా ఆధునీకరణతోపాటుగా సౌకర్యాలు పెద్ద ఎత్తులో అందుబాటులోకి వస్తాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీకి నిధులు పెద్ద ఎత్తున సమకూరుతాయని చెబుతున్నారు. దీనిపై ఆర్టీసీ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe