శబరిమల అయ్యప్ప స్వామి వారి దర్శనార్థం వెళ్లే భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రత్యేక బస్సు సేవలు, అద్దె ప్యాకేజీలను ప్రకటించింది. స్వామియే శరణం అయ్యప్ప అనే నినాదంతో భక్తుల ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా, భక్తిమయంగా మలిచేందుకు ఆర్టీసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. గ్రూపులుగా, గురుస్వాముల నేతృత్వంలో యాత్రకు వెళ్లే భక్తులకు పలు రాయితీలు, ఆర్థిక ప్రోత్సహకాలను అందిస్తోంది.

కనీసం 5 రోజుల వ్యవధికి బస్సును అద్దెకు బుక్ చేసిన గురుస్వాములు, ఏజెంట్లు లేదా నిర్వాహకులకు ఏపీఎస్ఆర్టీసీ రూ. 2,000 కమిషన్ అందిస్తుంది. బస్సు సీటింగ్ సామర్థ్యానికి అదనంగా వంటవారు, మణికంఠలు, సహాయకులుగా ఉండే గరిష్ఠంగా 7 గురు వ్యక్తులకు ప్రయాణం పూర్తి ఉచితం.
బడ్జెట్‌కు అనుగుణంగా ఆర్టీసీ పలు రకాల బస్సులను అందుబాటులో ఉంచింది. కిలోమీటరుకు నిర్ణయించిన అద్దె వివరాలు: అమరావతి ఏసీ-120, ఇంద్ర ఏసీ - 79, స్టార్ లైనర్- 66, సూపర్ లగ్జరీ-57, అల్ట్రా డీలక్స్-61, ఎక్స్‌ప్రెస్- 62, సప్తగిరి ఎక్స్‌ప్రెస్-62, అల్ట్రా పల్లెవెలుగు-62, పల్లెవెలుగు-52గా ఛార్జీలను నిర్ణయించింది.
పైన పేర్కొన్న ప్రత్యేక అద్దె ఛార్జీలపై 5 శాతం జీఎస్టీ అదనంగా వర్తిస్తుంది. సుదూర ప్రాంతాలకు సాగే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో భక్తి పాటలు, ఆధ్యాత్మిక సమాచారం వీక్షించేందుకు ప్రయాణ బస్సులలో ఆడియో/వీడియో సిస్టమ్‌ను అందుబాటులో ఉంచారు.
కొండ ప్రాంతాలు, సుదీర్ఘ మార్గాల్లో నడపడంలో అనుభవం ఉన్న డ్రైవర్లను ఆర్టీసీ కేటాయిస్తోంది. వేళకు గమ్యస్థానాలకు చేర్చేలా ఆన్-టైమ్ సర్వీస్‌ను అందిస్తుంది. భక్తుల ప్రయాణం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగేలా బస్సుల కండిషన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తారు.
శబరిమల యాత్రకు బస్సులను అద్దెకు తీసుకోవాలనుకునే భక్తులు, గురుస్వాములు లేదా ఏజెన్సీలు తమకు సమీపంలోని ఏపీఎస్ఆర్టీసీ డిపో లేదా డిపో మేనేజర్‌ను నేరుగా సంప్రదించి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ప్రైవేటు వాహనాల కంటే సురక్షితమైన, నమ్మకమైన సేవలను అందిస్తున్న ఏపీఎస్ఆర్టీసీని ఆశ్రయించి యాత్రను జయప్రదం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
{{/usCountry}}శబరిమల యాత్రకు బస్సులను అద్దెకు తీసుకోవాలనుకునే భక్తులు, గురుస్వాములు లేదా ఏజెన్సీలు తమకు సమీపంలోని ఏపీఎస్ఆర్టీసీ డిపో లేదా డిపో మేనేజర్‌ను నేరుగా సంప్రదించి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ప్రైవేటు వాహనాల కంటే సురక్షితమైన, నమ్మకమైన సేవలను అందిస్తున్న ఏపీఎస్ఆర్టీసీని ఆశ్రయించి యాత్రను జయప్రదం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
{{/usCountry}}