ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీలో కొలువుల జాతర మెుదలుకానుంది. పెద్ద ఎత్తున ఏపీఎస్ఆర్టీసీలో రిక్రూట్‌మెంట్ జరగనుంది. ఈ మేరకు కసరత్తు జరుగుతోంది. ఆర్టీసీలో ఖాళీలపై ప్రభుత్వానికి నివేదిక అందింది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆర్టీసీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించిన అనుమతి రాగానే రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మెుదలుకానుంది. అంతేకాదు ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల్లో కొందరికి జీతాలు కూడా పెరగనున్నాయి.

ఏపీఎస్ఆర్టీసీ మెుత్తం 7673 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయించింది. ఇందులో 3673 మంది డ్రైవర్ల్ పోస్టులు ఉన్నాయి. 1813మంది కండక్టర్లు, ఆ తర్వాత మెకానిక్, శ్రామిక్‌తోపాటుగా ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నారు. ఆయా ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వాన్ని ఆర్టీసీ అనుమతి కోరింది. త్వరలోనే ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజులకు నోటిఫికేషన్ వెలువడనుంది.
ఇక ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లకు కూడా ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆన్ కాల్ డ్రైవర్లకు రోజువారీ వేతనం 800 నుంచి 1000కి పెంచుతున్నారు. అంతేకాదు డబుల్ డ్యూటీ కండక్టర్లకు 900కు పెంచుతారు.
మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుతో ఆర్టీసీపై ఒత్తిడి పడుతోంది. ఇప్పుడు చేపట్టబోయే ఖాళీల భర్తీతో పెద్ద ఎత్తున ఉపశమనం దక్కనుంది. ఇప్పటికే చాలాసార్లు ఉద్యోగ సంఘాలు ఖాళీల భర్తీ కోసం డిమాండ్ చేశాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ నియమకాలు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.
ఏపీఎస్ఆర్టీసీ ఎప్పటికప్పుడు ప్రయాణికుల కోసం ప్రణాళికలు అమలుచేస్తూనే ఉంది. మెున్నటిమెున్న సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పండగకు ఇంటికి వచ్చేవారి కోసం ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక బస్సుడు ఆపరేట్ చేసింది. అంతేకాదు జనవరి 19, 2026న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రూ.27.68 కోట్లతో అత్యధిక ఆదాయాన్ని సంపాదించింది. ఇది కార్పొరేషన్ చరిత్రలోనే అత్యధికం. ఆ రోజున ఆర్టీసీ బస్సుల్లో 50.6 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు.
{{/usCountry}}ఏపీఎస్ఆర్టీసీ ఎప్పటికప్పుడు ప్రయాణికుల కోసం ప్రణాళికలు అమలుచేస్తూనే ఉంది. మెున్నటిమెున్న సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పండగకు ఇంటికి వచ్చేవారి కోసం ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక బస్సుడు ఆపరేట్ చేసింది. అంతేకాదు జనవరి 19, 2026న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రూ.27.68 కోట్లతో అత్యధిక ఆదాయాన్ని సంపాదించింది. ఇది కార్పొరేషన్ చరిత్రలోనే అత్యధికం. ఆ రోజున ఆర్టీసీ బస్సుల్లో 50.6 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు.
{{/usCountry}}