పర్యాటక రంగంలో, పారిశ్రామికంగా ఎంతో వేగంగా దూసుకుపోతున్న విశాఖపట్నం జిల్లా ప్రజా రవాణా వ్యవస్థలో త్వరలోనే ఒక విప్లవాత్మక మార్పు రాబోతోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రయాణికులకు అత్యాధునిక వసతులు కల్పించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) విశాఖ జిల్లాలో 100 సరికొత్త ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించింది.

ఈ ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా అందించే తొలి సర్వీసులను ముఖ్యంగా భోగాపురం అల్లురి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి (Bhogapuram Airport) అనుసంధానం చేయనున్నారు. జూలై మొదటి వారంలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుండటంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆర్టీసీ ఈ ముందస్తు ప్లాన్ వేసింది.
విశాఖపట్నం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి.అప్పలనాయుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రూట్ మ్యాప్, ప్రణాళికను అధికారికంగా వెల్లడించారు. నగరంలోని వివిధ కీలక మార్గాల్లో ఈ బస్సులను నడపడానికి రూట్లను ఖరారు చేశారు. అయితే ఈ 100 బస్సులను ఒకేసారి కాకుండా మూడు దశల్లో రోడ్లపైకి తీసుకురానున్నారు.
మొదటి దశ జూన్ నెలలోనే తొలి విడతగా 20 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తారు. రెండో, మూడో దశ (జూలై, ఆగస్టు) మిగిలిన 80 ఎలక్ట్రిక్ బస్సులను విడతల వారీగా సర్వీసుల్లోకి ప్రవేశపెడతారు.
ఈ 100 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం విశాఖలోని రెండు ప్రధాన డిపోలను ఎంపిక చేశారు. గాజువాక డిపోకు 50 బస్సులు, సింహాచలం డిపోకు 50 బస్సులను సమానంగా కేటాయించారు. ఈ డిపోలలో ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ కోసం అత్యాధునిక ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
ఈ గ్రీన్ ఎనర్జీ బస్సుల వల్ల విశాఖ నగరంలో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం గణనీయంగా తగ్గుతాయి. ఈ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులలో పుష్-బ్యాక్ సీట్లు, లైవ్ లొకేషన్ ట్రాకింగ్, సీసీటీవీ కెమెరాలు, అత్యవసర సమయాల్లో వాడేందుకు పానిక్ బటన్ వంటి భద్రతా వసతులు ఉంటాయి.
{{/usCountry}}ఈ గ్రీన్ ఎనర్జీ బస్సుల వల్ల విశాఖ నగరంలో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం గణనీయంగా తగ్గుతాయి. ఈ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులలో పుష్-బ్యాక్ సీట్లు, లైవ్ లొకేషన్ ట్రాకింగ్, సీసీటీవీ కెమెరాలు, అత్యవసర సమయాల్లో వాడేందుకు పానిక్ బటన్ వంటి భద్రతా వసతులు ఉంటాయి.
{{/usCountry}}వైజాగ్ నగరం, మధురవాడ, విజయనగరం తదితర ప్రాంతాల నుండి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే విమాన ప్రయాణికులకు ఈ బస్సులు ఒక వరంగా మారనున్నాయి. ప్రైవేట్ టాక్సీలతో పోలిస్తే చాలా తక్కువ ఛార్జీలతోనే ఎయిర్‌పోర్ట్ చేరుకోవచ్చు. ఈ సరికొత్త ఈ-బస్సుల రాకతో విశాఖ నగర రవాణా రంగం మరింత హైటెక్‌గా మారబోతోందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే భాగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ పెంచడంపై ఫోకస్ చేస్తారు అధికారులు.