...
...
Next Story

APSSDC Mega Job Mela : ఆగస్టు 27న స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మెగా జాబ్ మేళా

APSSDC Mega Job Mela : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) 2026 ఆగస్టు 27న చింతపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళాను ప్రకటించింది. సుమారు 10 కంపెనీలు ఇందులో పాల్గొని వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి.

Published on: Aug 26, 2026, 16:08:31 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) నిరుద్యోగ యువతీ యువకులకు గొప్ప అవకాశం కల్పిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో 2026 ఆగస్టు 27న భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. గిరిజన ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాల్లోని అర్హులైన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఈ ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నారు.

ఏపీలో మెగా జాబ్ మేళా
ఏపీలో మెగా జాబ్ మేళా

ఈ జాబ్ మేళాలో సుమారు 10 ప్రముఖ బహుళజాతి, స్వదేశీ కంపెనీలు పాల్గొని అభ్యర్థులను నేరుగా ఎంపిక చేయనున్నాయి. మొత్తం 595 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ప్రకటన వెలువడింది. ఫార్మా, ఆటోమొబైల్, రీటైల్, ఐటీ, లాజిస్టిక్స్, సేవా రంగాలకు చెందిన సంస్థలు తమ వద్ద ఉన్న ఉద్యోగ అవకాశాలను అభ్యర్థులకు అందించనున్నాయి.

10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులైన నిరుద్యోగులు తమ నైపుణ్యాలు, విద్యా అర్హతలకు తగిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు అర్హత, పోస్టును బట్టి నెలకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకు ప్రారంభ వేతనం లభిస్తుంది.

ఈ మెగా జాబ్ మేళాకు సంబంధించిన ప్రచార పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ టి. నిశాంతి అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల నిరుద్యోగ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు అందించేందుకు ఈ జాబ్ మేళా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అర్హత కలిగిన యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.

హాజరయ్యే అభ్యర్థులు APSSDC, అధికారిక Naipunyam పోర్టల్‌లో (naipunyam.ap.gov.in) తమ పేర్లను నమోదు చేసుకోవాలి. తెచ్చుకోవాల్సిన పత్రాలు అప్‌డేట్ చేసిన రెజ్యూమ్, విద్యా అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డ్ కాపీలు , ఇటీవల దిగిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తేవాలి. ఈ జాబ్ మేళా ద్వారా ఏజెన్సీ ప్రాంతంలోని మంది యువకులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. అర్హులైన నిరుద్యోగులు అందరూ తప్పక హాజరు కావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe