ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC), బిజినెస్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ (BNI) సహకారంతో విజయవాడలోని మొగల్రాజపురంలో ఉన్న పి.బి.సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జులై 12న ఒక భారీ ఉద్యోగ మేళాను నిర్వహించనుంది. ఒక ప్రకటనలో ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు, బీఎన్ఐ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జె.హెచ్. దేశాయ్, చైర్‌పర్సన్ అచంట మేఘన ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
ఏపీలో మెగా జాబ్ మేళా
{{^htLoading}} {{/htLoading}}
బీఎన్ఐ 10వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు దేశాయ్ తెలిపారు. ఈ నియామక ప్రక్రియలో జెన్‌ప్యాక్ట్, టెలిపెర్ఫార్మెన్స్ వంటి ప్రముఖ బహుళజాతి సంస్థలతో సహా 100కు పైగా కంపెనీలు పాల్గొంటాయని అధికారులు తెలిపారు.
10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, పీజీ లేదా ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఇందులో పాల్గొనడానికి అర్హులు. 18 నుండి 35 ఏళ్ల వయస్సు గల యువతీ యువకులు ఈ ఉద్యోగ మేళాకు హాజరుకావచ్చని, ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12,000 నుండి రూ.50,000 వరకు జీతంతో పాటు ఇతర ఉద్యోగ ప్రయోజనాలు కల్పిస్తారు. ఉద్యోగ మేళాలో నిర్వహించే ఆన్ ది స్పాట్ ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపడతారు.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పోర్టల్ ద్వారా ముందుగానే నమోదు చేసుకోవచ్చని దేశాయ్ సూచించారు. https://naipunyam.ap.gov.in/user-registration వెబ్‌సైట్‌ను సందర్శించి తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ రెజ్యూమ్ లేదా బయోడేటా, ఆధార్ కార్డు, ఆధార్‌తో అనుసంధానించిన మొబైల్ నంబర్, పాన్ కార్డు కాపీ, అన్ని విద్యా అర్హత పత్రాల జిరాక్స్ కాపీలను వెంట తెచ్చుకోవాలి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు కళ్యాణ్ (8333908080), నరేష్ (9032633548), కిషోర్ (9985759304)లను సంప్రదించవచ్చు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.