...
...
Next Story

AP DSC 2026 Notification : ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఈ లింక్స్ క్లిక్ చేయండి

AP DSC 2026 Notification : ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. 2,721 పోస్టులతో డీఎస్సీ-2026 పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.

Published on: Nov 5, 2026, 12:00:16 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నియామక పరీక్ష-2026(APTRT-2026) DSC-2026 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని ప్రకటిస్తూ అక్టోబర్ 13న సంక్షిప్త నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పాఠశాల విద్యా శాఖ నియామక ప్రక్రియకు సంబంధించిన సమగ్ర వివరాలను అందిస్తూ వివరణాత్మక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల(ప్రతీకాత్మక చిత్రం) (Unsplash)
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల(ప్రతీకాత్మక చిత్రం) (Unsplash)

ఖాళీలలో 2,111 రెగ్యులర్ స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉన్నాయి. 350 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు (150 స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 200 స్పెషల్ ఎడ్యుకేషన్ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు), ప్రిన్సిపాల్‌లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, PETలతో సహా వివిధ సొసైటీలలో 260 పోస్టులు ఉన్నాయి.

అర్హులైన అభ్యర్థులు నవంబర్ నుండి తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. దరఖాస్తు సమర్పణ విధానం, దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ, ఇతర వివరాలు నోటిఫికేషన్‌లో అందించారు. జీవోలు, విద్యా, వృత్తిపరమైన అర్హతలు, పరీక్షా విధానం, సిలబస్, పరీక్షల షెడ్యూల్, వివరణాత్మక నోటిఫికేషన్, సహాయ కేంద్రం వివరాలతో సహా DSC-2026కు సంబంధించిన పూర్తి సమాచారం పాఠశాల విద్యా శాఖ అధికారిక వెబ్‌సైట్: https://tet2dsc.apcfss.in/లో అందుబాటులో ఉంది. నవంబర్ 11 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.

నోటిఫికేషన్‌లో పోస్టుల వారీగా, జిల్లా వారీగా, సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు ఉన్నాయి. అంతేకాకుండా తమ ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించేటప్పుడు, అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ద్వారా కుల వర్గాల వారీగా ఖాళీలను, సంబంధిత పోస్టులకు వర్తించే సమాంతర రిజర్వేషన్ల వివరాలను చూసుకోవచ్చు.

చివరి పరీక్ష పూర్తయిన మరుసటి రోజు ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ప్రాథమిక కీ విడుదలైన 7 రోజులలోపు అభ్యంతరాలను సమర్పించాలి. అభ్యంతరాలను స్వీకరించడానికి నిర్ణయించిన చివరి తేదీ నుండి 7 రోజుల తర్వాత తుది కీ విడుదల అవుతుంది. తుది కీ విడుదలైన 7 రోజుల తర్వాత మెరిట్ జాబితా ప్రకటిస్తారు.

దరఖాస్తుదారులు ఫీజు చెల్లింపు, దరఖాస్తు సమర్పణతో ముందుకు వెళ్లే ముందు సమాచార బుల్లెటిన్‌ను జాగ్రత్తగా చదివి, ఈ నియామకానికి కావలసిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉన్నామని నిర్ధారించుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే ప్రభుత్వ సేవ/ స్వయంప్రతిపత్తి సంస్థలు/ స్థానిక సంస్థలు/ ప్రభుత్వ సహాయక సంస్థలు మొదలైన వాటిలో శాశ్వత లేదా తాత్కాలిక హోదాలో లేదా వర్క్ ఛార్జ్డ్ ఉద్యోగులుగా, కాంట్రాక్ట్ లేదా అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వ్యక్తులు, తాము ఈ నియామకానికి దరఖాస్తు చేస్తున్నట్లు తమ కార్యాలయానికి రాతపూర్వకంగా తెలియజేయవలసి ఉంటుంది.

దరఖాస్తుదారులు ప్రతి పోస్టుకు రిక్రూట్‌మెంట్ టెస్ట్ ప్రాసెసింగ్, నిర్వహణ కోసం దరఖాస్తు రుసుముగా రూ.1000 మొత్తాన్ని 11.11.2026 నుండి పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించాలి.వలసి ఉంటుంది.

01/07/2026 నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, 44 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఈ నియామకానికి అర్హులు కారు. అయితే ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల విషయంలో, గరిష్ట వయోపరిమితి 49 సంవత్సరాలుగా ఉంటుంది. కింద ఇచ్చే లింక్స్ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదవండి.

DSC-2026 School Education Notification

DSC-2026 Societies Notification

DSC-2026 School Education Spl Notification

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks