రాప్తాడు స్కూల్ ఘటన : కోలుకుంటున్న విద్యార్థిని - తాజా హెల్త్ అప్డేట్ ఇదే

బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాప్తాడు పాఠశాల దాడి బాధితురాలు గోపిక కోలుకుంటోందని వైద్యుల బృందం తెలిపింది. స్పృహలోకి వచ్చిన ఆమె ఆరోగ్యం మెరుగవుతుండటంతో నేటి సాయంత్రం వెంటిలేటర్ తొలగించనున్నారు.

Published on: Nov 2, 2026, 12:04:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాల తరగతి గదిలో రంపంతో భయంకరమైన దాడికి గురై తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థిని గోపిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక అప్‌డేట్ ఇచ్చారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలిక క్రమంగా కోలుకుంటోందని…. ఆమె ఆరోగ్యంలో స్థిరమైన పురోగతి కనిపించిందని వైద్యుల బృందం స్పష్టం చేసింది.

రాప్తాడు స్కూల్ ఘటన
రాప్తాడు స్కూల్ ఘటన

ఇందుకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆ బాలిక పూర్తిగా స్పృహలోకి వచ్చిందని, ఆమె తల్లిని కూడా కలవడానికి ఆస్పత్రి వర్గాలు అనుమతించినట్లు పేర్కొన్నారు. బాలిక స్వయంగా ఊపిరి తీసుకోగలిగేలా ఆరోగ్యం మెరుగుపడటంతో…. సోమవారం సాయంత్రానికి వెంటిలేటర్ సపోర్ట్‌ను తొలగించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. బాలిక త్వరగా పూర్తి కోలుకోవాలని యావత్ రాష్ట్ర ప్రజలు, కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు.

బెంగళూరు మణిపాల్ ఆసుపత్రికి వైఎస్ జగన్ పర్యటన

ఈ క్రమంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం బెంగళూరుకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2:15 గంటలకు మణిపాల్ ఆసుపత్రికి చేరుకోనున్న జగన్…. ఆసుపత్రి వైద్యులను కలసి గోపికకు అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం బాధిత విద్యార్థిని కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి, ఓదార్చనున్నారు.

రాప్తాడు పాఠశాలలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనపై అనంతపురం జిల్లా పోలీసులు వేగంగా స్పందించారు. ఈ ఘటనపై విచారణకు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఆదివారం అనంతపురం జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంత శివార్లలో నిందితుడిని పోలీసులు చుట్టుముట్టారని ఎస్పీ జగదీష్ తెలిపారు.

ఆ సమయంలో నిందితుడు కత్తితో పోలీసులపై దాడికి దిగి ఒక ఇన్ స్పెక్టర్‌ను గాయపరచడంతో, పోలీసులు ఆత్మరక్షణార్థం కాల్పులు జరిపారు. నిందితుడి మోకాలి కింద భాగంలో దాదాపు ఆరు రౌండ్ల కాల్పులు జరగ్గా, తీవ్రంగా గాయపడిన నిందితుడిని పోలీసులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని, విచారణకు సహకరించే పరిస్థితి వచ్చాక పూర్తిస్థాయిలో ప్రశ్నిస్తామని ఎస్పీ తెలిపారు.

పాఠశాల గదిలోనే జరిగిన ఈ దాడితో తీవ్ర భయాందోళనలకు గురైన విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ‘ట్రామా-రెస్పాన్స్’ కార్యక్రమాన్ని ప్రకటించారు. 20 మంది మానసిక నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, రాప్తాడు పాఠశాలలోని పదో తరగతి 'ఎ' విభాగానికి చెందిన 32 మంది విద్యార్థులతో పాటు 8, 9, 10 తరగతుల బాలికల ఇళ్లకు నేరుగా పంపిస్తున్నారు. కౌన్సెలర్లు పిల్లలకు, వారి తల్లిదండ్రులకు భావోద్వేగ మద్దతు అందిస్తూ భయం నుంచి బయటపడేలా కృషి చేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More