రాప్తాడులో విద్యార్థినిని రంపంతో కోసిన హేమంత్‌పై పోలీసుల కాల్పులు
రాప్తాడులో విద్యార్థినిని రంపంతో కోసిన హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో నిందితుడు పారిపోతుండగా ఈ ఘటన జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దారుణంగా దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన హేమంత్‌ను పట్టుకునే క్రమంలో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు.

పోలీసు యంత్రాంగం అందించిన వివరాల ప్రకారం.. దాడి అనంతరం పరారైన నిందితుడు హేమంత్ కోసం ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో నిందితుడు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పోలీసులను చూసిన హేమంత్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రాళ్లతో దాడి చేశాడు. లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ వినకుండా పారిపోతుండటంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో హేమంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది.
అసలు పాఠశాలలో ఏం జరిగింది?
రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని తరగతి గదిలో ఉండగా నిందితుడు హేమంత్ చెట్లు కోసే ఎలక్ట్రిక్ రంపంతో పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించాడు. ప్రేమిస్తున్నానంటూ వేధించగా, బాలిక తిరస్కరించడమే కాకుండా కుటుంబ సభ్యులు మందలించడంతో కక్ష పెంచుకున్న హేమంత్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఉపాధ్యాయిని పాఠాలు చెబుతున్న సమయంలోనే గదిలోకి వచ్చి బాలికపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ దాడిలో విద్యార్థిని ముఖం, గొంతు భాగాల్లో తీవ్రమైన గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన మరొక విద్యార్థినికి కూడా గాయాలయ్యాయి.
ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించింది. విద్యార్థినులకు భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన పాఠశాల హెచ్‌ఎంపై విద్యాశాఖ సస్పెన్షన్ వేటు వేసింది.
ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని మంత్రి నారా లోకేశ్ వెళ్లి బెంగళూరు ఆసుపత్రిలో పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉందని లోకేశ్ వెల్లడించారు. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని, 48 గంటలపాటు ఆమెను జాగ్రత్తగా సంరక్షించాలన్నారు. ప్రజల దీవెనలతో బాలిక ఆరోగ్యం కుదుటపడుతుందన్నారు.
'విద్యార్థిని మీద దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. చట్టపరంగా నిందితుడిగి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చిన్నారుల రక్షణ కోసం బలమైన వ్యవస్థను తీసుకొస్తాం. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. బాలికను నా సొంత కూతురిలా కాపాడే బాధ్యత తీసుకుంటాను.' అని లోకేశ్ అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


