డయల్ 112 పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్ సేవలతో అనుసంధానం
డయల్ 112 అత్యవసర సేవను త్వరలో ఏపీలోని పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక సేవలతో అనుసంధానించనున్నారు. ఈ మూడు విభాగాలు సమన్వయంతో స్పందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
డయల్ 112 ఎమర్జెన్సీ సేవలను మూడు విభాగాలతో కలపనున్నారు. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ పి.వెంకట రమణ ఈ విషయాన్ని వెల్లడించారు. డయల్ 112 అత్యవసర సేవను త్వరలో రాష్ట్రంలోని పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక సేవలతో అనుసంధానించనున్నట్లు తెలిపారు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో ఈ మూడు విభాగాలు సమన్వయంతో స్పందించే అవకాశం కలుగుతుంది.

రెండు దశాబ్దాల తర్వాత పరికరాల ఆధునీకరణ, కొత్త వాహనాల కొనుగోలుతో సహా, ఈ విభాగంలో చేపడుతున్న భారీ సంస్కరణల్లో భాగంగానే ఈ చర్య తీసుకుంటున్నారు అధికారులు. అనంతపురంలో పర్యటించిన సందర్భంగా కొత్త అగ్నిమాపక వాహనాలను, అత్యాధునిక అగ్నిమాపక పరికరాలను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వేగవంతమైన స్పందన, ఆధునిక పరికరాల వినియోగం(ఇరుకైన ప్రాంతాల్లో కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫోర్-వీలర్ వాహనాలతో సహా) కారణంగా గత ఏడాదితో పోలిస్తే అగ్ని ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని 50 శాతానికి పైగా నివారించగలిగామని తెలిపారు.
అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడటమే అగ్నిమాపక సేవల విభాగం ప్రాథమిక బాధ్యత అని వెంకట రమణ ఉద్ఘాటించారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు పరిశ్రమలకు చెందిన ప్రైవేట్ అగ్నిమాపక సేవలను కూడా ప్రభుత్వ అగ్నిమాపక వ్యవస్థతో అనుసంధానించనున్నట్లు వెల్లడించారు. ఒక్కోటి సుమారు రూ.2.25 కోట్ల అంచనా వ్యయంతో 17 కొత్త అగ్నిమాపక కేంద్రాల భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. అందులో ఇప్పటికే ఆరు కేంద్రాల నిర్మాణం పూర్తయిందని తెలిపారు.
మరో 36 అగ్నిమాపక కేంద్రాల ఆధునీకరణ పనులు కూడా చేపట్టనున్నట్లు వెంకట రమణ పేర్కొన్నారు. మొదటి దశలో 65 అగ్నిమాపక వాహనాల కోసం రూ.33 కోట్లు మంజూరు చేశామని, రెండో దశలో మరో 58 వాహనాలను కొనుగోలు చేయనున్నామని రమణ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల ద్వారా రూ.252.86 కోట్లతో ఈ విభాగాన్ని బలోపేతం చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో 25 అత్యాధునిక అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచినట్లు డీజీ తెలిపారు. సుమారు రూ.40 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


