Sprite Tejas Express : దేశంలోనే తొలి ప్రైవేట్ బ్రాండెడ్ రైలుగా.. తేజాస్ ఎక్స్‌ప్రెస్
భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త ప్రయోగానికి తెరలేచింది. లక్నో-దిల్లీ తేజాస్ ఎక్స్‌ప్రెస్ ఇకపై 'స్ప్రైట్ తేజాస్ ఎక్స్‌ప్రెస్'గా మారనుంది. ఈ సరికొత్త బ్రాండింగ్ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి..
భారతీయ రైల్వే రంగానికి సంబంధించి ఒక వినూత్న ప్రయోగానికి రంగం సిద్ధమైంది! సరికొత్త అడ్వర్టైజింగ్ డీల్ కింద ప్రఖ్యాత లక్నో-దిల్లీ-లక్నో తేజాస్ ఎక్స్‌ప్రెస్.. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ బ్రాండెడ్ ప్యాసింజర్ రైలుగా అవతరించనుంది.

రైల్వే వర్గాల సమాచారం ప్రకారం.. పరిమిత కాలం పాటు ఈ రైలును 'స్ప్రైట్ తేజాస్ ఎక్స్‌ప్రెస్' (Sprite Tejas Express) అని పిలవనున్నారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఈ రైలుకు సంబంధించి ఆరు నెలల పాటు అడ్వర్టైజింగ్ హక్కులను స్ప్రైట్ కంపెనీకి కేటాయించింది.
స్ప్రైట్ తేజాస్ ఎక్స్‌ప్రెస్..
రైలు నంబర్లు 82501, 82502 కింద నడిచే ఈ రైళ్లకు 2026 ఆగస్టు 19 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో ఈ ప్రత్యేక బ్రాండింగ్ అమల్లో ఉండనుంది.
దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రైళ్లలో తేజాస్ ఎక్స్‌ప్రెస్ ఒకటి కావడంతో ఈ ప్రాజెక్ట్ కోసం దీన్ని ఎంపిక చేశారు. ఇప్పటికే రైల్వే శాఖ స్టేషన్లు, రైళ్లు, ఇతర రైల్వే ఆస్తుల ద్వారా ప్రకటనల రూపంలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. టికెట్ ధరలను పెంచకుండానే రైల్వేకు అదనపు ఆదాయం సమకూర్చేందుకు ఈ కొత్త ప్రణాళిక ఎంతగానో దోహదపడుతుందని సంబంధిత వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ, "ఒక రైలుకు బ్రాండ్ పేరు పెట్టడం ఇదే మొదటిసారి. లక్నో-దిల్లీ-లక్నో తేజాస్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ రైలు అయినప్పటికీ, ఐఆర్‌సీటీసీ భారతీయ రైల్వేకు హౌలింగ్ ఛార్జీలు చెల్లిస్తుంది. ఇందులో ట్రాక్‌లు, రైల్వే స్టేషన్ల వంటి మౌలిక సదుపాయాల వినియోగం కూడా కలిసి ఉంటుంది," అని పేర్కొన్నారు.
తేజాస్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలు కలిగిన సూపర్ ఫాస్ట్ రైలు. ప్రయాణాన్ని మరింత సుఖవంతంగా మార్చేందుకు ఇది ప్రయాణంలోనే నాణ్యమైన ఆహారం, పానీయాలు, వినోద సేవలను అందిస్తుంది.
అలాగే ఈ రైలులో గ్రూప్ బుకింగ్స్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. కార్పొరేట్ సమావేశాలు, పెళ్లిళ్లు లేదా ఇతర వేడుకల కోసం ప్రయాణించే వారు మొత్తం ఏసీ చైర్ కార్ కోచ్‌ను ప్రత్యేకంగా బుక్ చేసుకోవచ్చు.
ఈ లక్నో-దిల్లీ తేజాస్ ఎక్స్‌ప్రెస్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డిసెంబర్ 3, 2021న అధికారికంగా ప్రారంభించారు.
టికెట్ బుకింగ్ కష్టాలకు చెక్..
మరోవైపు ప్రయాణ రంగంలో ఒక కీలక అధ్యాయానికి తెరలేపింది భారతీయ రైల్వే! టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దూరం చేయడానికి రైల్వే శాఖ సరికొత్త ప్రయాణికుల రిజర్వేషన్ సిస్టమ్‌కు (పీఆర్‌ఎస్) మారుతోంది. 2010 నుంచి అమల్లో ఉన్న పాత టెక్నాలజీ స్థానంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన కొత్త వ్యవస్థను దశలవారీగా ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా తత్కాల్ సమయంలో సర్వర్ డౌన్ అవ్వడం, బుకింగ్ స్లో అవ్వడం వంటి సమస్యలకు ఈ కొత్త సిస్టమ్ చక్కటి పరిష్కారం చూపనుంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


