సింహాచలం అప్పన్న దర్శనానికి వెళ్తున్నారా? ఈ రూల్ పాటిస్తేనే దర్శనం

సింహాచలం అప్పన్న దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చినవారికే స్వామివారి దర్శనం ఉండనుంది.

Published on: Nov 7, 2026, 12:22:27 IST
By , Simhachalam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

విశాఖపట్నం సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, సింహచలంలో స్వయంభూ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవాలయంలో భక్తుల దుస్తులపై ఆలయ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సింహాచలం అప్పన్న దర్శనార్థం వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులను ధరించాల్సి ఉంటుందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు స్పష్టం చేశారు.

సింహాచలం
సింహాచలం

ఈ నూతన నిబంధనలను ఈ నెల చివరి నుంచే అమల్లోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆలయ పవిత్రతను పరిరక్షించడం, హిందూ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడం, స్వామివారి పట్ల భక్తిప్రపత్తులను పెంపొందించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని దేవస్థానం తెలిపింది.

ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించాలి. పురుషులు పంచె, కుర్తా-పైజామాలాంటివి వేసుకోవచ్చు. జీన్స్ ప్యాంట్లు, టీ-షర్టులు, షార్ట్స్ వేసుకోరాదు. మహిళలు చీర, లంగా ఓణీ, చుడీదార్ లాంటివి వేసుకోవాలి. జీన్స్, టాప్స్, లెగ్గింగ్స్, స్లీవ్‌లెస్ / పొట్టి దుస్తులు ధరించి దర్శనానికి రావొద్దు.

సింహాచలంలో కొలువుదీరిన అప్పన్న స్వామి క్షేత్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఏడాదంతా స్వామివారు చందన పూతతో నరసింహ రూపంలో దర్శనమిస్తారు. సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే అక్షయ తృతీయ నాడు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది.

వరాహము, నరుడు, సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్రలో – వరాహము తల, సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది.

వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం(నిజరూపదర్శనం) ఆలయ అధికారులు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఉత్సవం ముందురోజు అర్థరాత్రి 12.30 గంటల నుంచి ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలు ప్రారంభిస్తారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి నిత్యం తరలివస్తుంటారు. డ్రెస్ కోడ్ నిబంధనలతో పాటు ఆలయ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు దేవస్థానం పలు చర్యలు చేపడుతోంది.

డ్రెస్ కోడ్ అమలుపై అవగాహన కల్పించేందుకు కొండపైన, మెట్ల మార్గం వద్ద ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. రద్దీ సమయాల్లోనూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వదర్శనం, ప్రత్యేక దర్శనాల క్యూ లైన్లను పటిష్టం చేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More