తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి వారి గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న మోక్ష మార్గం వద్ద స్థానిక యంత్రాంగం, దేవస్థాన అధికారులు కఠిన భద్రతా చర్యలు చేపట్టారు. ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న విషాదకర సంఘటనల దృష్ట్యా, భక్తుల రక్షణే ధ్యేయంగా అధికారులు కీలక మార్పులు తీసుకొచ్చారు.

అరుణాచల గిరిప్రదక్షిణ చేసే భక్తులు ఈ చిన్న ఇరుకైన గుహ మార్గం గుండా వెళ్తే మోక్షం లభిస్తుందని, పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ముఖ్యంగా శారీరక రుగ్మతలు నయమవుతాయని బలంగా నమ్ముతారు. అయితే ఈ చిన్న మార్గం గుండా వెళ్లే క్రమంలో ఇటీవల ఒక తెలుగు భక్తుడు చిక్కుకుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఆ తర్వాత కూడా పలువురు భక్తులు ఇందులో ఇరుక్కుని ఇబ్బంది పడిన ఘటనలు జరిగాయి.
ఈ వరుస ప్రమాదాల నేపథ్యంలో భక్తుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం కావడంతో, మోక్ష మార్గ ప్రవేశంపై యంత్రాంగం తక్షణమే దృష్టి సారించింది. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆలయ పాలకమండలి ప్రత్యేక చర్యలు చేపట్టింది.
మోక్ష మార్గంలోకి వెళ్లే ముందే భక్తులు దానికి సరిపోతారో లేదో తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక ఇనుప గ్రిల్‌ను ఏర్పాటు చేశారు. ఈ గ్రిల్ పరిమాణం సరిగ్గా ఇడుక్కు పిళ్లైయార్(మోక్ష మార్గం) గుహ ద్వారంతో సమానంగా ఉంటుంది. ఈ ఐరన్ గ్రిల్ గుండా సులభంగా దూరి బయటకు రాగలిగిన భక్తులను మాత్రమే అసలు మోక్షమార్గంలోకి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఈ కొత్త విధానానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
గతంలో రాత్రింబవళ్లు ఈ మార్గం అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు మాత్రమే మోక్షమార్గాన్ని తెరిచి ఉంచుతున్నారు. రాత్రి వేళల్లో భద్రతా కారణాల దృష్ట్యా ప్రవేశాన్ని పూర్తిగా మూసివేశారు.
{{/usCountry}}గతంలో రాత్రింబవళ్లు ఈ మార్గం అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు మాత్రమే మోక్షమార్గాన్ని తెరిచి ఉంచుతున్నారు. రాత్రి వేళల్లో భద్రతా కారణాల దృష్ట్యా ప్రవేశాన్ని పూర్తిగా మూసివేశారు.
{{/usCountry}}ఆలయ ప్రాంగణంలో అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లతో కూడిన బోర్డులను అమర్చారు. అంతేకాకుండా తమిళం, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో స్పష్టమైన హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అధిక బరువు ఉన్నవారు, వృద్ధులు, అలాగే గుండెజబ్బులు, శ్వాసకోశ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ గుహలోకి వెళ్లకూడదని స్పష్టం చేశారు.
నమ్మకంతో లేదా తొందరపాటుతో బలవంతంగా లోపలికి ప్రవేశించి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని, అధికారుల సూచనలను తప్పక పాటించాలని భక్తులను కోరుతున్నారు. అరుణాచలం వచ్చే భక్తులు శివయ్య దర్శనం చేసుకుని, సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్లాలని అధికారులు కోరుతున్నారు.