Parawada Pharma City Fire Accident : ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో మంగళవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పరవాడ ఫార్మాసిటీలో ఉన్న దక్షిణ ఎనర్జీ కంపెనీలో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో కార్మికులు బయటకు వచ్చే అవకాశం లేకపోయిందని తెలుస్తోంది.

మృతి చెందిన ఇద్దరు కార్మికులను అచ్యుతాపురం వాసులుగా అధికారులు గుర్తించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
సీఎం చంద్రబాబు ఆరా…
పరవాడ ఫార్మా సిటీ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘోర ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి ప్రమాద తీవ్రతను, సహాయక చర్యలను సమీక్షించారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఫార్మా సిటీ అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు, పరవాడ నుంచి మరొక అగ్నిమాపక శకటం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. "ప్రమాదంలో గాయపడిన బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలి, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుంది," అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
విచారణ జరిపించాలి - వైఎస్ జగన్
ఈ ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "విశాఖ ఫార్మా సిటీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరం," అని ఆయన పేర్కొన్నారు. పరవాడ దక్షిణ ఎనర్జీ సంస్థ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని ప్రకటించారు.
{{/usCountry}}ఈ ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "విశాఖ ఫార్మా సిటీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరం," అని ఆయన పేర్కొన్నారు. పరవాడ దక్షిణ ఎనర్జీ సంస్థ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని ప్రకటించారు.
{{/usCountry}}ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కోరారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై జగన్ కీలక సూచనలు చేశారు. "ఈ ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘోర ఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను అధికారులు కచ్చితంగా తనిఖీ చేయాలి" అని వైయస్ జగన్ స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి తగిన సహాయం అందించాలని ఆయన కోరారు.