కర్నూలులోని ఓర్వకల్లు ఫార్మా హబ్‌గా అభివృద్ధి చెందుతోంది: ఏపీ ప్రభుత్వం

కర్నూల్‌లోని ఓర్వకల్లు ఫార్మా హబ్‌గా అభివృద్ధి చెందుతోందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ పెట్టుబడులు పెట్టాయని తెలిపింది.

Published on: Dec 15, 2025, 14:20:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఫార్మా హబ్‌గా అభివృద్ధి చెందుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. హైదరాబాద్‌కు చెందిన రెండు కంపెనీలు విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఓర్వకల్లులో పెట్టుబడులు పెట్టాయని పేర్కొంది.

ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం

'ఔషధ తయారీకి ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ తన స్థానాన్ని వేగంగా బలోపేతం చేసుకుంటోంది, హైదరాబాద్‌కు చెందిన విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.' అని అధికారిక పత్రికా ప్రకటన తెలిపింది.

యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్స్(APIలు), ఆర్గానిక్ కెమికల్స్ తయారీ సౌకర్యాన్ని స్థాపించడానికి ఓర్వకల్లు నోడ్‌లోని ఐపీ గుట్టపాడు క్లస్టర్‌లో 100 ఎకరాలకు పైగా కేటాయింపుకు విరూపాక్ష ఆర్గానిక్స్ ఆమోదం పొందింది. దీని పెట్టుబడి రూ.1,225 కోట్లు ఉంటుందని, లాజిస్టిక్స్, యుటిలిటీస్, అనుబంధ సేవలలో పరోక్ష ఉపాధితో పాటు, దాదాపు 1,500 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫార్మాస్యూటికల్ కూడా పెట్టుబడులు పెట్టనుంది.

ఇటీవల వైజాగ్‌లో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో సంతకం చేసిన ఒప్పందాల ద్వారా విరూపాక్ష ఆర్గానిక్స్, సిగాచి ఇండస్ట్రీస్ విస్తరణ ప్రణాళికలు కన్ఫామ్ అయ్యాయి. ఓర్వకల్లులో ఔషధ, అనుబంధ తయారీ ప్రాజెక్టులు ఇప్పుడు కలుస్తుండటంతో, కర్నూలు జిల్లా దక్షిణ భారతదేశంలో ఔషధ తయారీ గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతోందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన ఫార్మాసిటీ భూ సేకరణ నోటిఫికేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఫార్మాసిటీకి బదులుగా ఫ్యూచర్ సిటీని తెరపైకి తీసుకొచ్చింది. అయితే హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫార్మా కంపెనీలు ఏపీలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. తెలంగాణ సరిహద్దుకు చేరువలో ఉన్న కర్నూలు జిల్లాలో ఈ రెండు కంపెనీలకు కొత్తగా పెట్టుబడులు పెడుతున్నాయి. హైదరాబాద్ నుంచి నాలుగు గంటల దూరంలో ఉన్న ఓర్వకల్లులో విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ వస్తున్నాయి. హైదరాబాద్ దగ్గరగా ఉండటం, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నందును ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More