...
...
Next Story

పాడేరు పాస్టర్‌పై దాడి సీన్ రివర్స్.. అంతా హైడ్రామా.. ఎస్పీ సంచలన నిజాలు!

పాస్టర్ అభినయ్ దర్శన్‌పై దాడి పూర్తి కల్పితమని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. ఈ దాడిలో 8 మందిపై కేసులు నమోదు చేసినట్టుగా చెప్పారు.

Published on: May 20, 2026, 22:03:04 IST
Advertisement

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో తీవ్ర సంచలనం సృష్టించిన పాస్టర్ అభినయ్ దర్శన్‌పై దాడి ఉదంతం సరికొత్త మలుపు తిరిగింది. పాస్టర్‌పై జరిగిన దాడి కేవలం ఒక హైడ్రామా అని, అదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారం సృష్టించిన కల్పిత కథ అని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ అధికారికంగా ప్రకటించారు. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు నిజాలను మీడియా ముందు ఉంచుతూ, మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు చేసిన ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించారు.

అభినయ్ దర్శన్‌
అభినయ్ దర్శన్‌

ఈ కల్పిత దాడి ఘటనకు సంబంధించి పాస్టర్‌తో పాటు మొత్తం ఎనిమిది మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

నిందితుల వివరాలు ఇవే

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ హైడ్రామాలో కీలక పాత్ర పోషించిన వారిని నిందితులుగా చేర్చారు: ఏ1 : పాస్టర్ అభినయ్ దర్శన్, ఏ2 : బిల్లా కిరణ్, ఏ3 : కె. బెన్హర్, ఏ4 : భానుప్రసాద్. వీరితో పాటు ఈ కల్పిత దాడికి, నాటకానికి క్షేత్రస్థాయిలో సహకరించిన వసంతకుమార్, ప్రేమ్‌కుమార్, సత్యరాజు, ఇంద్రకుమార్‌లపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

సమాజంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టడానికి, రెండు వర్గాల మధ్య మతపరమైన విద్వేషాలు, ఘర్షణలు రెచ్చగొట్టాలనే దురుద్దేశంతోనే ఈ ప్లాన్ వేసినట్లు ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. తనపై ఎవరో దాడి చేశారంటూ నమ్మించి, సమాజంలో సానుభూతి పొందడంతోపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని పాస్టర్ అభినయ్ ప్రయత్నించినట్లు విచారణలో తేలింది.

పాస్టర్ అభినయ్‌పై పాత క్రిమినల్ కేసులు

పోలీసుల ప్రాథమిక విచారణలో పాస్టర్ అభినయ్ దర్శన్ అంతకుముందు కూడా పలు అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. అతనిపై గతంలోనే తీవ్రమైన వరకట్న వేధింపుల కేసుతో పాటు, ఒక యువతిని వేధించిన క్రిమినల్ కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని ఎస్పీ మీడియాకు వివరించారు. చట్టం నుంచి తప్పించుకోవడానికి, తనపై ఉన్న కేసులను పక్కదారి పట్టించడానికి కూడా ఈ కల్పిత దాడిని అస్త్రంగా వాడుకోవాలని చూసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe