Bandi Bhagirath POCSO Case : బిగ్ బ్రేకింగ్... పోక్సో కేసులో పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్

Bandi Bhagirath POCSO Case : పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. చట్టం ముందు అందరూ సమానమేనని, విచారణకు సహకరిస్తామని ఆయన తండ్రి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు.

Published on: May 16, 2026, 20:47:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bandi Bhagirath POCSO Case : పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోని నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత కొన్ని రోజులుగా విచారణకు దూరంగా ఉన్న బండి భగీరథ్…. తన న్యాయవాదులతో కలిసి స్టేషన్‌కు వచ్చి విచారణకు హాజరయ్యారు.

పోక్సో కేసులో పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్
పోక్సో కేసులో పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్

చట్టానికి లోబడి ఉండాల్సిందే - బండి సంజయ్

ఈ పరిణామంపై భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. చట్టంపై ఉన్న గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. "సత్యమేవ జయతే.. చట్టం ముందు నా బిడ్డైనా, సామాన్యుడైనా సమానమే. మనమందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే," అని బండి సంజయ్ పేర్కొన్నారు.

తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడని… వాస్తవానికి ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులకు అప్పగించాలని భావించినట్లు మంత్రి తెలిపారు. అయితే, లాయర్లను సంప్రదించి తమ వద్ద ఉన్న ఆధారాలను వారి ముందు ఉంచడం వల్ల కొంత సమయం పట్టిందని వివరించారు. ఈ కేసు నిలబడదని…. కచ్చితంగా బెయిల్ వస్తుందని న్యాయవాదులు భరోసా ఇచ్చారని, ఆ కారణంగానే పోలీసుల ముందుకు రావడంలో కొంత జాప్యం జరిగిందని ఆయన అంగీకరించారు.

శనివారం కూడా బెయిల్ వస్తుందని లాయర్లు చెప్పినప్పటికీ…. ఇంకా ఆలస్యం చేయడం సరికాదనే ఉద్దేశంతోనే లాయర్ల ద్వారా తన కుమారుడిని పోలీసుల విచారణకు అప్పగించినట్లు స్పష్టం చేశారు.

న్యాయ వ్యవస్థపై తనకు సంపూర్ణమైన నమ్మకం ఉందని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. వచ్చే సోమవారం రోజు కోర్టు నుంచి కీలక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ…. చట్టాన్ని గౌరవిస్తూ అంతవరకు ఆగకుండా పేట్ బషీరాబాద్ పోలీసుల విచారణకు పంపించానని ఆయన వెల్లడించారు. భగీరథ్ లొంగిపోవడంతో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని తదుపరి చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More