Bandi Bhagirath POCSO Case : బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు జారీ - ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం..! రంగంలోకి స్పెషల్ టీమ్స్

Bandi Bhagirath POCSO Case : మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ దేశం దాటిపోకుండా పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. అతని కోసం 5 ప్రత్యేక బృందాలు గాలిస్తుండగా, బంజారాహిల్స్‌లోని బండి సంజయ్‌ నివాసంలో సోదాలు జరుగుతున్నాయి.

Published on: May 16, 2026, 14:11:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bandi Bhagirath POCSO Case : మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ కేసులో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. నిందితుడు ఏ క్షణమైనా విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందనే అనుమానంతో పోలీసులు దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలు, రేవులను అప్రమత్తం చేస్తూ లుకౌట్ సర్క్యులర్ (LOC) నోటీసులు జారీ చేశారు. బండి భగీరథ్‌పై ఇప్పటికే అత్యంత కఠినమైన పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైన నేపథ్యంలో…. అతనిని ఎలాగైనా అదుపులోకి తీసుకునేందుకు పోలీస్ యంత్రాంగం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది.

బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు జారీ
బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు జారీ

రంగంలోకి ప్రత్యేక బృందాలు…

బండి భగీరథ్‌ జాడ కనిపెట్టేందుకు ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు సాంకేతిక ఆధారాలు, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా వేర్వేరు ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి. నిందితుడితో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్న వ్యక్తులు, అతని ఆత్మీయ స్నేహితులు మరియు కుటుంబ బంధువుల ఇళ్లపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. ఎవరి వద్దనైనా ఆశ్రయం పొందుతున్నాడా అనే కోణంలోనూ సోదాలు సాగుతున్నాయి.

గాలింపు చర్యల్లో భాగంగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికారిక నివాసానికి శనివారం ఒక ప్రత్యేక పోలీస్ బృందం చేరుకుంది. అక్కడ భగీరథ్ ఉన్నాడా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి పోలీసులు ఇంట్లో క్షుణ్ణంగా సోదాలు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ కేసు రాజకీయంగా, సామాజికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తుండటంతో చట్టపరమైన చర్యలు అత్యంత పారదర్శకంగా, వేగంగా తీసుకుంటున్నట్లు సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More