Prakash Raj On POCSO Case : రేవంత్ రెడ్డిగారు... బండిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు..? ప్రకాశ్ రాజ్ ట్వీట్

Prakash Raj On Bandi Bhagirath Case : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసుపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు. నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు.

Published on: May 12, 2026, 14:33:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Prakash Raj On Bandi Bhagirath Case : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసుపై అత్యంత హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో స్పందిస్తుండగా…. మరోవైపు సినీ నటులు కూడా రియాక్ట్ అవుతున్నారు.

ప్రకాష్ రాజ్ (PTI)
ప్రకాష్ రాజ్ (PTI)

ఎందుకు అరెస్ట్ చేయట్లేదు..? ప్రకాశ్ రాజ్

తాజాగాఈ వ్యవహారంపై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికగా అత్యంత ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తప్పుబడుతూ ప్రశ్నలు సంధించారు.

బాలికను వేధించారనే ఆరోపణలపై కేసు నమోదై ఇన్ని రోజులవుతున్నా, నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నినదించే "బేటీ బచావో.. బేటీ పడావో" (ఆడపిల్లను కాపాడండి) నినాదాన్ని ఎద్దేవా చేస్తూ.. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇది "బేటా బచావో" (కొడుకును కాపాడండి) లాగా కనిపిస్తోందని విమర్శించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ నేరుగా ప్రశ్నలు సంధించారు. "బండి ఎక్కి పారిపోయిన అమానుష బండిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు…?" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ముదురుతున్న వివాదం

ఇప్పటికే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించగా, మరోవైపు విపక్షాలు, పౌర సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. బాధితురాలికి న్యాయం చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలనే డిమాండ్ పెరుగుతోంది.

ఇక ఈ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సీరియస్ అయ్యారు. తక్షణమే ప్రత్యేక బృందాలతో విచారణ జరిపించాలని సోమవారం డీజీపీని ఆదేశించిన సంగతి తెలిసిందే. డీజీపీ ఆదేశాల మేరకు…. కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే పెట్ బషీరాబాద్ పోలీసులతో సమావేశమైన డీసీపీ రితిరాజ్… కేసు వివరాలను తెలుసుకున్నారు. బాధితురాలి స్టేట్ మెంట్ కూడా రికార్డ్ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతుండగా… మరోవైపు బండి భగీరథ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More