...
...
Next Story

కార్తిక సోమవారం.. శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు!

కార్తిక సోమవారం కావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆలయాలు శివయ్య నామస్మరణతో మార్మోగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు శివాలయాలకు వస్తున్నారు.

Published on: Oct 27, 2025, 09:46:37 IST
Advertisement

కార్తిక మాసం ప్రారంభమైంది. ప్రత్యేకమైన కార్తిక సోమవారం కావడంతో భక్తులు ఆలయాలకు వచ్చి భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. కార్తిక మాసం ముదటి సోమవారం కావడంతో పంచాక్షరి మంత్రంతో శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి. ఆలయాలు కార్తిక శోభను సంతరించుకున్నాయి. కార్తిక మాసం తొలి సోమవారం కావడంతో మహా శివుడి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయమే శివయ్యను దర్శించుకుని.. ఆలయాల్లో కార్తిక దీపాలను వెలగించారు.

కార్తిక సోమవారం ప్రత్యేక పూజలు
కార్తిక సోమవారం ప్రత్యేక పూజలు

తెల్లవారుజామున నుంచే ఆలయాల వద్ద భక్తుల సందడి కనిపించింది. పవిత్ర దినమైన కార్తిక సోమవారం నాడు భక్తులు గంగా స్నానం చేసి.. భక్తి భావంతో శివాలయాలను దర్శించుకున్నారు. ఏపీలోని శ్రీశైలం, కాళహస్తితోపాటుగా ఇతర శివాలయాలు శివయ్య నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శైవక్షేత్రాలు కార్తిక శోభను సంతరించుకున్నాయి. ఓం నమ: శివాయా పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తున్నారు భక్తులు.

ఇక తెలంగాణలోని శైవక్షేత్రాల్లోనూ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేములవాడ, కాళేశ్వరం, నల్గొండ ఛాయా సోమేశ్వర ఆలయం, చెరువుగట్టుతోపాటు రాష్ట్రంలోని శివాలయాలు శివయ్య నామస్మరణతో మార్మోగుతున్నాయి. కుటుంబ సమేతంగా ఆలయాలకు వచ్చిన భక్తులు పరమేశ్వరుడికి అభిషేకాలు చేస్తున్నారు. అనేక ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు.

కార్తిక సోమవాం రోజున ఉపవాసం ఆచరించిన వ్యక్తికి కైలాస ప్రవేశం ఉంటుందని నమ్మకం. ఈ రోజున వ్రతం చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయని చెబుతారు భక్తులు. కుటుంబంలో సుఖసంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని అంటారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe