తిరుమలలో వైభవంగా భాగ్‌ సవారి.. సెప్టెంబర్ 26న పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో సెప్టెంబర్ 24వ తేది సాయంత్రం భాగ్‌ సవారి అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు పూర్తయిన మరుసటి రోజు నిర్వహించడం ఆనవాయితీ.

Updated on: Sep 25, 2026, 06:21:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తిరుమలలో సెప్టెంబర్ 24వ తేది సాయంత్రం భాగ్‌ సవారి ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తులను తిరుమాడ వీధులలో విహరిస్తూ అనంతాళ్వారు తోటకు వేంచేస్తారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మూత్సవాలు పూర్తయిన మరుసటిరోజు తిరుమలలో భాగ్‌ సవారి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

తిరుమలలో భాగ్‌ సవారి
తిరుమలలో భాగ్‌ సవారి

తిరుమలలో సెప్టెంబ‌రు 25వ తేదీన అనంత పద్మనాభ వ్రతాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీభూవరాహస్వామి ఆలయం పక్కనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు తీసుకువెళ్లి అర్చకులు ఆగమొక్తంగా పూజాది కార్యక్రమాలు ఉంటాయి.

అనంతరం శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామి పుష్కరిణిలో అభిషేకాదులు నిర్వహించి, చక్ర స్నానం నిర్వహించి, తిరిగి ఆలయానికి వేంచేపు చేస్తారు.

తిరుమలలో సెప్టెంబరు 26వ తేదీన పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాత్రి 7 నుండి రాత్రి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో తన ఛాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో జేఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఈ ఏడాది గత ఏడాదితో పోలిస్తే 15 నుంచి 20 శాతం వరకు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక అనుభూతితోపాటు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జేఈవో ఆదేశించారు. ప్రతి శాఖ తమ పరిధిలో చేపట్టాల్సిన పనులపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని సూచించారు. పంచమి తీర్థం రోజున భక్తుల రద్దీ అత్యధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని జేఈవో ఆదేశించారు.

పంచమి తీర్థం రోజున భక్తుల కోసం పటిష్టమైన క్యూ లైన్లు, బ్యారికేడ్లు, భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు 4 హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని ముఖ్యమైన ప్రవేశ పాయింట్ల వద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లు, భక్తులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేలా సూచిక బోర్డులు, తిరుచానూరు, తిరుపతి ప్రాంతాల్లో అవసరమైన చోట్ల ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టే విద్యుత్ అలంకరణలు భక్తులను ఆకట్టుకునేలా, ఆలయ పవిత్రతను ప్రతిబింబించేలా ఉండాలని జేఈవో సూచించారు. ఆలయ పరిసరాలు, ప్రధాన రహదారులు, మాడ వీధులు, భక్తుల రాకపోకలు జరిగే ప్రాంతాల్లో సంప్రదాయ ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణలకు ప్రత్యేక కాన్సెప్ట్ రూపొందించి, అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More