ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీరప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. గోవా, పాండిచ్చేరి తరహాలో పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా ఏపీ తీరాలలో ‘బీచ్ షాక్స్’ ఏర్పాటుకు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారికంగా జీవో నంబర్ - 362ను జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్(APTDC) పర్యవేక్షణలో రాష్ట్రంలోని 12 తీర ప్రాంత జిల్లాల్లో ఎంపిక చేసిన బీచ్‌లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన కీలక సిఫార్సుల ఆధారంగా ఈ సరికొత్త పర్యాటక విధానానికి తెరలేపారు.
సూర్యలంక, వైజాగ్‌లలో తొలి ప్రయోగం
ఈ ప్రాజెక్టును తొలుత పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా బాపట్లలోని ప్రసిద్ధ సూర్యలంక బీచ్, విశాఖపట్నంలోని ప్రముఖ బీచ్‌లలో మొదటి విడతగా ఈ బీచ్ షాక్స్ అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2029 ఆగస్టు 31వ తేదీ వరకు (ఐదేళ్ల కాలపరిమితి) ఈ షాక్స్ నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఏడాది పాటు వీటి పనితీరు, పర్యాటకుల స్పందన, శాంతిభద్రతలను సమీక్షించిన తర్వాతే రాష్ట్రంలోని మిగతా బీచ్‌లకు ఈ విధానాన్ని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
కఠిన నిబంధనలు
పర్యాటక వినోదంతో పాటు స్థానిక సంస్కృతి, భద్రతకు భంగం కలగకుండా ఎక్సైజ్ శాఖ కఠినమైన రూల్స్ విధించింది. ఈ బీచ్ షాక్స్ కేవలం ఉదయం 10:00 గంటల నుంచి రాత్రి 08:00 గంటల వరకు మాత్రమే పనిచేయాలి. రాత్రి వేళల్లో వీటికి అనుమతి ఉండదు.
ఇక్కడ కేవలం తక్కువ ఆల్కహాల్ శాతం ఉండేవి(Beer, Wine, Breezers వంటివి) మాత్రమే సరఫరా చేయాలి. సాధారణ భారత తయారీ విదేశీ మద్యం (IMFL), ఇతర ఫారిన్ లిక్కర్ అమ్మకాలపై పూర్తిగా నిషేధం విధించారు. జాతీయ రహదారుల సమీపంలో మద్యం విక్రయాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని, ఈ షాక్స్‌ల ఏర్పాటులోనూ ఆ నిబంధనలను కచ్చితంగా పాటించనున్నారు.
పర్యావరణ పరిరక్షణే ముఖ్యం
{{/usCountry}}ఇక్కడ కేవలం తక్కువ ఆల్కహాల్ శాతం ఉండేవి(Beer, Wine, Breezers వంటివి) మాత్రమే సరఫరా చేయాలి. సాధారణ భారత తయారీ విదేశీ మద్యం (IMFL), ఇతర ఫారిన్ లిక్కర్ అమ్మకాలపై పూర్తిగా నిషేధం విధించారు. జాతీయ రహదారుల సమీపంలో మద్యం విక్రయాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని, ఈ షాక్స్‌ల ఏర్పాటులోనూ ఆ నిబంధనలను కచ్చితంగా పాటించనున్నారు.
పర్యావరణ పరిరక్షణే ముఖ్యం
{{/usCountry}}ఈ బీచ్ షాక్స్‌లను పర్యావరణానికి హాని కలిగించని తాత్కాలిక నిర్మాణాలతోనే నిర్మించాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ బాధ్యత పూర్తిగా నిర్వాహకులదే. ప్రస్తుతం మాల్దీవులు, గోవా వంటి ప్రాంతాలకు వెళ్తున్న దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆంధ్రా తీరానికి రప్పించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. ఆధునిక ఆహారపు అలవాట్లు, వినోద సౌకర్యాలతో కూడిన ఈ షాక్స్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగడమే కాకుండా, తీర ప్రాంత స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పర్యాటక శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.