నవంబర్ 1 నుంచి బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ ట్రైన్.. వయా ఆంధ్రప్రదేశ్!

Vande Bharat Sleeper Train : దక్షిణ భారతదేశంలో మెుట్టమెుదటి వందే భారత్ స్లీపర్ రైలు రానుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణం చేయనుంది. నవంబర్ 1న బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభించే అవకాశం ఉంది.

Published on: Oct 21, 2026, 14:59:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలును నవంబర్ 1న ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరుసటి రోజు నుండి ఈ రైలు రెగ్యులర్ సర్వీసులు ప్రారంభిస్తుంది. ఈ రైలు వారానికి ఆరు రోజులు నడిపే ఛాన్స్ ఉంది. సోమవారాల్లో బెంగళూరు-ముంబై రైలు, మంగళవారాల్లో ముంబై-బెంగళూరు రైలు సర్వీసు ఉండదు. అయితే రైల్వే బోర్డు నుండి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సర్వీసులను జెండా ఊపి ప్రారంభించనున్నారని సమాచారం.

వందే భారత్​ స్లీపర్​ రైలు (PTI)
వందే భారత్​ స్లీపర్​ రైలు (PTI)

ఈ రైలు అందుబాటులోకి వస్తే దక్షిణ భారతదేశంలో నడిచే మొదటి వందే భారత్ స్లీపర్ రైలుగా రికార్డు సృష్టిస్తుంది. ఇది రెండు ప్రధాన మహానగరాల మధ్య నైట్ జర్నీ చేయడానికి అవకాశం ఇస్తుంది. రైలు నంబర్ 27652 బెంగళూరు–ముంబై మార్గం, రైలుకు నంబర్ 27651 ముంబై నుండి బెంగళూరుకు ప్రయాణిస్తుంది.

బెంగళూరు–ముంబై వందే భారత్ స్లీపర్ ట్రైన్ రాత్రి 10 గంటలకు కేఎస్‌ఆర్ బెంగళూరు నుండి బయలుదేరుతుంది. అర్ధరాత్రి 12.50 గంటలకు ధర్మవరానికి చేరుకుంటుంది. ఉదయం 5.05 గంటలకు వాడికి చేరుకుంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1.50 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్(సీఎస్‌ఎంటీ)కి చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ముంబై నుంచి బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు రాత్రి 10.30 గంటలకు సీఎస్‌ఎంటీ నుండి బయలుదేరి ఉదయం 7.25 గంటలకు వాడికి, ఉదయం 11.45 గంటలకు ధర్మవరానికి చేరుకుంటుంది. మధ్యాహ్నం 2.50 గంటలకు కేఎస్‌ఆర్ బెంగళూరుకు చేరుకుంటుంది. ఈ ట్రైన్ రూట్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లను కలుపుతుంది. ఈ రైలు ఏపీలోని కీలక స్టేషన్లలో కూడా ఆగే అవకాశం ఉంది. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ సర్వీసుల కోసం రెండు వందే భారత్ స్లీపర్ రైలు సెట్లను వినియోగిస్తారు. సోలాపూర్, పుణెలను నీటి సరఫరా, ఇతర టెర్మినల్ సంబంధిత అవసరాల కోసం కేటాయించారు. ఈ కొత్త సర్వీసు రాత్రిపూట సుదూర ప్రయాణాలు చేసే ప్రయాణికులకు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన ప్రయాణ మార్గాన్ని అందిస్తుంది.

భారతదేశంలో మొదటి వందే భారత్ స్లీపర్ సర్వీస్ అస్సాంలోని కామాఖ్య-పశ్చిమ బెంగాల్‌లోని హౌరా మధ్య 2026 జనవరి 22న కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ రైలు, దాదాపు 972 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 14 గంటల్లో ప్రయాణిస్తుంది. ఇప్పుడు బెంగళూరు-ముంభై మధ్య ప్రారంభమయ్యే సర్వీసు రెండోది. ఇది దక్షిణ ఉత్తర భారతదేశాన్ని కలుపుతుంది.

16 కోచ్‌లు గల ఒక వందే భారత్ స్లీపర్ రైలులో 823 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఇందులో 611 బెర్త్‌లతో 11 థర్డ్ ఏసీ కోచ్‌లు, 188 బెర్త్‌లతో నాలుగు సెకండ్ ఏసీ కోచ్‌లు, 24 బెర్త్‌లతో ఒక ఫస్ట్ ఏసీ కోచ్ ఉంటాయి. ఈ రైలులో పూర్తిగా ఏసీ సౌకర్యం ఉన్న కోచ్‌లు, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, సీసీటీవీ నిఘా, బయో-వ్యాక్యూమ్ టాయిలెట్లు, సెన్సార్‌తో పనిచేసే నీటి కుళాయిలు, ప్రత్యేక రీడింగ్ లైట్లు, ఛార్జింగ్ పాయింట్లు, డిజిటల్ స్క్రీన్ మీద సమాచారం వంటి ఆప్షన్స్ ఉంటాయి. అంతేకాదు వెజ్, నాన్‌వెజ్ క్యాటరింగ్ సర్వీస్ కూడా ఉంటుంది. సేఫ్టీపరంగానూ వందే భారత్ స్లీపర్ రైలు బెస్ట్‌గానే ఉంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More