భాగ్యనగర్ గణేష్ ఉత్సవాల షెడ్యూల్ విడుదల.. నిమజ్జనం ఎప్పుడు?

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి(BGUS) గణేష్ ఉత్సవాల షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 14న వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపనతో ప్రారంభమై సెప్టెంబర్ 25న నిమజ్జనంతో ముగుస్తాయని ప్రకటించింది.

Updated on: Jul 24, 2026, 09:36:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నగరం వేదికగా ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి (BGUS) సర్వం సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది 47వ సామూహిక గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 14న వినాయక విగ్రహాల ప్రతిష్టాపనతో ప్రారంభమై సెప్టెంబర్ 25న అనంత చతుర్దశి పర్వదినాన శోభాయాత్ర, మహానిమజ్జనంతో ముగుస్తాయని ఉత్సవ సమితి అధికారికంగా ప్రకటించింది.

వినాయక చవితి 2026
వినాయక చవితి 2026

ఈ సంవత్సరం నిర్వహించే నవరాత్రి వేడుకలు అనేక చారిత్రక, సాంస్కృతిక ఘట్టాల కలయికగా నిలవనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల్లో క్రింది ప్రముఖ ఘట్టాలను స్మరించుకోనున్నట్లు బీజీయూఎస్ అధ్యక్షుడు జి. రాఘవరెడ్డి, కార్యదర్శి రావినూతల శశిధర్ గురువారం వెల్లడించారు:

జాతీయ భావాన్ని రగిలించిన 'వందేమాతరం' గీతం 150వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. విశ్వహిందూ పరిషత్ (VHP) మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ 100వ జయంతి సందర్భంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సిద్ధిఅంబర్ బజార్‌లోని బాహేతీ భవన్‌‌లో పండుగ నిర్వహణ కార్యాలయాన్ని ఉత్సవ సమితి ప్రతినిధులు ఘనంగా ప్రారంభించారు. గణేష్ ఉత్సవాలను దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఘట్టంగా మలిచిన లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ 170వ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం విశేషం. ఈ కార్యక్రమంలో సమితి వ్యవస్థాపక సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు బండారు దత్తాత్రేయతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

దేశీయ పరిశ్రమలకు, స్థానిక చేతివృత్తుల వారికి చేయూత అందించేలా, ఉత్సవాల్లో కేవలం స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలని మండపాల నిర్వాహకులకు, భక్తులకు ఉత్సవ సమితి విజ్ఞప్తి చేసింది. అలాగే పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి విగ్రహాలను పూజించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలని ప్రతినిధులు సూచించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More