...
...
Next Story

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్.. కొత్త తేదీలు!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పురపాలికల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం తాత్కాలిక బ్రేక్ వేసింది.

Published on: Oct 21, 2026, 20:29:50 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నడుమ అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ఎస్ఈసీ ప్రకటించింది. ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది.

19 మున్సిపాలిటీల్లో ఎన్నికలు పెండింగ్
19 మున్సిపాలిటీల్లో ఎన్నికలు పెండింగ్

ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.

రాష్ట్రంలోని పల్నాడు, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నామినేషన్ల ఘట్టం రణరంగాన్ని తలపించడం, ఘర్షణలు చోటుచేసుకోవడంతో మెుదట 19 స్థానిక సంస్థల ఎన్నికలపై అనిశ్చితి నెలకొంది. ఈ 19 పురపాలికలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇచ్చే సమగ్ర క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగానే తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.

ఇందులో తిరుపతి, కడప, పులివెందుల, రాజంపేట, ప్రొద్దుటూరు, రాయచోటి, బద్వేల్‌, జమ్మలమడుగు, మైదుకూరు, కమలాపురం, ఎర్రగుంట్ల, పుంగనూరు, పిడుగురాళ్ల, గురజాల, దాచేపల్లి, కనిగిరి, దర్శి, గుత్తి, తాడిపత్రి ఉన్నాయి.

ఈ జిల్లాల పరిధిలోని కలెక్టర్లు, పోలీసు అధికారుల నుంచి తుది నివేదికలు వచ్చిన తర్వాతే ఈ ప్రాంతాల్లో పోలింగ్ సజావుగా సాగేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయో లేదో సమీక్షించి నిర్ణయించాలనుకుంది. పోటీ చేసే అభ్యర్థులపై దాడులు, బెదిరింపులు జరుగుతున్నాయనే ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తీవ్రంగా స్పందించారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడేది లేదని అధికారులకు చెప్పారు. అయితే ఆ తర్వాత కాసేపటికే 100 మున్సిపాలిటీల్లో ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు స్వేచ్ఛగా, ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని ఎస్ఈసీ అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోటీ చేసే అభ్యర్థులకు, ముఖ్యంగా ప్రతిపక్ష, స్వతంత్ర అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని పోలీసు రంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా, శాంతియుతంగా పూర్తయ్యేలా కలెక్టర్లు, ఎస్పీలు నిరంతరం పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.

ఏపీ స్థానిక పోరులో నామినేషన్ల నాటి నుంచి వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో ఎస్‌ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్ పడటం.. ఏం జరుగుతుందా అనేది ఆసక్తిగా మారింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks