...
...
Next Story

ఫిబ్రవరి 16న ఏపీకి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. చంద్రబాబుతో మీటింగ్!

ఫిబ్రవరి 16వ తేదీన ఆంధ్రప్రదేశ్‌కు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రానున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు పర్యటన ఖరారైనట్టుగా సమాచారం.

Updated on: Feb 4, 2026, 22:15:39 IST
Advertisement

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఫిబ్రవరి 16న అమరావతిని సందర్శించి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసే అవకాశం ఉంది. మెుదట ఈ పర్యటన 18వ తేదీన ఉంటుందని భావించారు. కానీ ముందుగానే వస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్దరు చర్చించనున్నారని సమాచారం. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్యలో మెరుగైన ఫలితాలను సాధించడానికి ఏఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది మార్చిలో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.

ఏపీకి బిల్ గేట్స్
ఏపీకి బిల్ గేట్స్

హెల్త్‌కేర్ అనలిటిక్స్, డిజిటల్ అగ్రికల్చర్, గవర్నెన్స్‌లో టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ప్రజలకు వేగంగా సేవలను అందించడానికి ఈ ఎంఓయూపై సంతకం చేశారు. ఈ ప్రాజెక్టు అమలుపై చంద్రబాబు, బిల్ గేట్స్ మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. అంతేకాదు మైక్రోసాఫ్ట్ అమరావతిలో క్వాంటం వ్యాలీలో పెట్టుబడి విషయంపై కూడా చర్చించే అవకాశం ఉంది. చంద్రబాబుతో జరిగే అదే సమావేశంలో దీనిపై మరింత స్పష్టత వెలువడుతుందని చర్చ నడుస్తోంది.

ఇటీవల గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యారోగ్య శాఖ రూపొందించిన డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా వివిధ ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారి నుంచి సమాచారం తెలుసుకున్నారు చంద్రబాబు. వారి ఆరోగ్యాన్ని మెరుగు పర్చేందుకు నిపుణులైన వైద్యులతో పాటు ఔషధాలను ఇచ్చేలా సంజీవని ప్రాజెక్టు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అత్యుత్తమ టెక్నాలజీ ద్వారా ప్రజల ఆరోగ్య అంశాలను పర్యవేక్షించేలా ఈ ప్రాజెక్టు చేపట్టామని వివరించారు.

బిల్ గేట్స్ ఫౌండేషన్, టీసీఎస్ సహకారంతో ఈ డిజినెర్వ్ సెంటర్ ద్వారా ప్రతీ ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డులను తయారు చేస్తున్నామని తెలిపారు. సంజీవని ప్రాజెక్టు అమలుతో పాటు మరిన్ని రంగాల్లో సహకారం అందించేందుకు త్వరలోనే బిల్ గేట్స్ రాష్ట్రానికి రానున్నారని కొన్ని రోజుల కిందట సీఎం వెల్లడించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe