బీఆర్ నాయుడు వివాదంలో తెరపైకి లేఖ.. టీటీడీ ఛైర్మన్ పదవికి రిజైన్ చేయాలని వైసీపీ డిమాండ్!
టీటీడీ ఛైర్మన్ వీడియోల వివాదం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అవి డీప్ ఫేక్ వీడియోలు అని బీఆర్ నాయుడు కొట్టిపారేశారు. అయినప్పటికీ ఈ విషయాన్ని ప్రతిపక్ష వైసీపీ వదిలిపెట్టడం లేదు.
కొన్ని రోజులుగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు పేరుతో వీడియో క్లిప్పింగ్స్‌పైనే రాజకీయ నడుస్తోంది. వైసీపీ సోషల్ మీడియా ఆ వీడియోలను ఎక్కువగా వైరల్ చేస్తోంది. అంతేకాదు ఆ పార్టీ ముఖ్యనేతలు సైతం ఈ విషయంపై మాట్లాడుతున్నారు. టీటీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోలు డీప్ ఫేక్ అని బీఆర్ నాయుడు క్లారిటీ ఇచ్చారు.

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో వీడియోలలో కనిపించిన మహిళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్‌లకు వివరణాత్మక లేఖ రాసి, ఆయనతో తనకున్న అనుబంధం గురించి వివరించిందని వైఎస్సార్సీపీ తెలిపింది. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియాలో ఓ లేఖను పోస్ట్ చేసింది.
టీటీడీ ఛైర్మన్ గా బీఆర్ నాయుడు రాజీనామా చేయాలనే డిమాండ్‌ను వైసీపీ బలంగా వినిపిస్తోంది. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. ఈ వీడియోలు, ఫోటోలను పరిశీలన కోసం పంపామన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


