గుంటూరులో దారుణమైన ఘటన.. నడిరోడ్డుపై మహిళపై వివస్త్రను చేసి..!

గుంటూరులో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసి దాడి చేశారు కొంతమంది. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published on: Jul 18, 2026, 10:44:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో మానవత్వాన్ని మంటగలిపే అత్యంత అమానుష ఘటన వెలుగుచూసింది. నడిరోడ్డుపై ఒక మహిళను వివస్త్రను చేసి, విచక్షణారహితంగా దాడి చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాజం తలదించుకునేలా సాగిన ఈ అనాగరిక చర్యపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలి ఆక్రందనలు విన్నా చూస్తూ ఉండిపోయారు కొందరు వ్యక్తులు.

గుంటూరులో దారుణం
గుంటూరులో దారుణం

జులై 15వ తేదీన రాత్రి కృష్ణబాబుకాలనీకి చెందిన మహిళ తన ఇంటి ముందర కుళాయి నుంచి మోటారు ద్వారా నీళ్లు పట్టుకుంటుంది. ఈ క్రమంలో మోటార్ తొలగించాలని చెబుతూ.. 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి వెంకటరమణమూర్తి, అతడి కుటుంబ సభ్యులు ఆమెతో గొడవకు దిగారు. తీవ్రంగా దాడి చేశారు. బాధితురాలు వెళ్తుంటే.. వెంటపడి మరి కొట్టారు. వెంకటరమణమూర్తి సోదరి, ట్రాన్స్‌జెండర్ మాధవి కొట్టారు.

బాధితురాలి వెంటపడి దుస్తులు చించేసి పూర్తిగా వివస్త్రను చేశారు. బాధితురాలు వదిలేయాలని వేడుకున్నది. అయినా పట్టించుకోలేదు. స్థానికంగా ఉన్న మహిళలు కాసేపటి తర్వాత అడ్డుకుని.. బాధితురాలికి దుస్తులు ఇచ్చారు. ఈ నెల 16వ తేదీన బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మెుత్తం 9 మందిపై ఈ ఘటనలో కేసు నమోదు చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

మహిళల గౌరవం, భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా సహించబోమని పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి స్పష్టం చేశారు. అంతేకాదు 21వ డివిజన్‌ కార్యదర్శి వెంకటరమణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

గుంటూరు నగరంలోని ఒక ప్రధాన కూడలి వద్ద ఈ దారుణ ఘటన చోటుచేసుకోవడంతో ఇప్పుడు సంచలనమైంది. నిందితులు సదరు మహిళను నడిరోడ్డుపైకి లాగి, బట్టలు ఊడదీసి దారుణంగా కొట్టాడాన్ని కొందరు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు.

ఈ ఘటన సోషల్ మీడియా ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. మహిళల రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడబోదని ఆమె స్పష్టం చేశారు. 'గుంటూరులో మహిళపై జరిగిన అమానుష దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. సభ్య సమాజం తలదించుకునే ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతాం. నిందితులపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన శిక్ష పడేలా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించాను.' అని హోంమంత్రి చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More