...
...
Next Story

బీఎస్ఎన్ఎల్ స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్లు.. ఏపీలో కొత్త టవర్లు, 4జీ సేవల విస్తరణ!

BSNL : బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా స్వదేశీ 4జీ కనెక్టివిటీ, శాటిలైట్ కమ్యూనికేషన్, డిజిటల్ సేవలను విస్తరించే ప్రణాళికలను వివరించింది.

Updated on: Aug 15, 2026, 06:57:08 IST
Advertisement

భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్(BSNL) ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా స్వదేశీ 4జీ నెట్‌వర్క్ విస్తరణ, శాటిలైట్ కమ్యూనికేషన్, అత్యాధునిక డిజిటల్ సేవల అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రణాళికలను వెల్లడించింది. బీఎస్‌ఎన్‌ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం. శేషాచలం ఈ వివరాలను పంచుకున్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీని బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మొబైల్, ఫైబర్ (FTTH) వినియోగదారుల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ ఆకర్షణీయమైన ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.

బీఎస్‌ఎన్ఎల్
బీఎస్‌ఎన్ఎల్

రూ.1 ఫ్రీడమ్ 2.0 ఆఫర్ (Freedom 2.0 Offer): ఈ సిమ్ తీసుకుంటే రోజుకు 1 GB డేటా, 100 SMSలు, అపరిమిత కాలింగ్ సౌకర్యం లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజులు. మరోవైపు రూ. 2,399 వార్షిక ప్లాన్‌తో అదనంగా 47 రోజులు లభిస్తాయి, దీంతో వ్యాలిడిటీ 412 రోజులకు చేరుతుంది.

రూ.1,111 ఫైబర్ ఫ్రీడమ్ ప్లాన్: 200 Mbps స్పీడ్‌తో 5,000 జీబీ డేటా లభిస్తుంది. దీనితో పాటు 25కి పైగా ప్రీమియం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, అపరిమిత వాయిస్ కాలింగ్ లభిస్తాయి.

రూ.499 ఫైబర్ బేసిక్ ప్లాన్ (60 Mbps): మొదటి నెల సేవలు పూర్తిగా ఉచితం. అంతేకాకుండా తరువాతి మూడు నెలల కాలంలో మొత్తం రూ.300 డిస్కౌంట్ లభిస్తుంది.

ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్ పూర్తి స్వదేశీ 4జీ సాంకేతికతను వినియోగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 6,850 టవర్లు, 15,000 బిటిఎస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా మరో 26,300 కొత్త బిటిఎస్ సైట్ల కోసం ఆర్డర్లు ఇచ్చారు.

ఏపీలోని 2,641 మారుమూల గ్రామాలకు కనెక్టివిటీ అందించేందుకు ఇప్పటివరకు 1,359 టవర్లను నిర్మించారు. ఇందులో అరకులో 581, ఉమ్మడి తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 391, చిత్తూరులో 112 టవర్లు ఉన్నాయి. మరో 814 సైట్ల ద్వారా 1,206 గ్రామాలకు సేవలు విస్తరించనున్నారు. ఇప్పటికే 367 చోట్ల పనులు ప్రారంభమవ్వగా, మార్చి 2027 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

'మేడ్ ఇన్ ఇండియా' టెలికాం పరికరాల ప్రోత్సాహానికి 'పాలీక్యాబ్'తో ఒప్పందం చేసుకుంది. Hardware-as-a-Service మోడల్‌తో పాటు FTTH, OTT, e-SIM, యూనివర్సల్ SIM సేవలను విస్తరిస్తోంది. సర్కిల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఎన్ఓసీల ద్వారా నెట్‌వర్క్ సేవలను 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో బీఎస్‌ఎన్‌ఎల్ జాతీయస్థాయిలో రూ.24,500 కోట్లు, ఏపీ సర్కిల్ పరిధిలో రూ.1,089 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఈ ఏడాది జాతీయంగా రూ.30,000 కోట్లు, ఏపీలో రూ.1,307 కోట్ల రాబడిని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో 104 ఫ్రాంచైజీ ప్రాంతాలు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గలవారు ఫ్రాంచైజీలు, TIPలు, DSAలు, రూరల్ డిస్ట్రిబ్యూటర్లుగా చేరే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే కార్పొరేట్/ఎంటర్‌ప్రైజ్ కస్టమర్ల కోసం ఒక నెల రోజుల ఉచిత ILL ట్రయల్, రెట్టింపు బ్యాండ్‌విడ్త్, 12 నెలల అడ్వాన్స్ పేమెంట్‌పై 13 నెలల సేవలందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks