...
...
Next Story

TTD Recruitment : టీటీడీలో ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీ - ఈనెల 10, 11 తేదీల్లో రాత పరీక్షలు, కీలక సూచనలివే

TTD Engineering Recruitment 2026 : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి ముహూర్తం ఖరారైంది. మే 10, 11 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 93 కేంద్రాల్లో ఆన్‌లైన్ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు నిబంధనలు అతిక్రమిస్తే పరీక్షకు అనుమతించబోమని టీటీడీ స్పష్టం చేసింది.

Published on: May 9, 2026, 12:01:18 IST
Advertisement

TTD Engineering Recruitment : ఇంజినీరింగ్ విభాగంలోని పోస్టుల భర్తీకి సంబంధించి టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. మే 10, 11 తేదీలలో ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో రాత పరీక్షలను నిర్వహించనుంది. ఈ పరీక్షల ద్వారా ఏఈఈ (సివిల్), ఏఈఈ (ఎలక్ట్రికల్), ఏఈ (సివిల్), ఏటీవో (సివిల్) పోస్టులను భర్తీ చేయనున్నారు.

టీటీడీలో ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీ - మే 10, 11 తేదీల్లో రాత పరీక్షలు
టీటీడీలో ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీ - మే 10, 11 తేదీల్లో రాత పరీక్షలు

తిరుమలలో అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆలయ నిర్మాణాలు, మరియు నిర్వహణ పనుల్లో ఇంజినీరింగ్ విభాగం కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ఈ విభాగంలోని ఖాళీలను భర్తీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్ లకు సంబంధించి కేటాయించిన కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయి. ఏఈఈ (సివిల్) – 93 కేంద్రాలు, ఏఈఈ (ఎలక్ట్రికల్)- 16 కేంద్రాలు, ఏఈ (సివిల్)- 42 కేంద్రాలు, ఏటీవో (సివిల్) – 42 కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయని టీటీడీ తాజా ప్రకటనలో పేర్కొంది.

పరీక్షల పూర్తి షెడ్యూల్

అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షలను రెండు రోజుల్లో వివిధ షిఫ్టుల వారీగా విభజించారు. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి:

  • AEE (సివిల్) – 10.05.2026 – ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు
  • AEE (ఎలక్ట్రికల్) – 10.05.2026 – మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు
  • AE (సివిల్) – 11.05.2026 – ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు
  • ATO (సివిల్) – 11.05.2026 – మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు

అభ్యర్థులకు కీలక సూచనలు:

  • పరీక్ష రాసే అభ్యర్థులు ఏ చిన్న తప్పు చేసినా పరీక్షకు దూరం కావాల్సి ఉంటుందని టీటీడీ హెచ్చరించింది. ముఖ్యంగా పాటించాల్సిన నిబంధనలు ఇవే:
  • పరీక్ష ప్రారంభం కావడానికి కనీసం రెండు గంటల ముందుగానే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు తేల్చి చెప్పారు.
  • మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు, క్యాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. సాధారణ రిస్ట్ వాచ్‌లు కూడా ధరించకూడదు.
  • అభ్యర్థులు తమ హాల్ టికెట్‌లో ఉన్న ప్రతి నిబంధనను క్షుణ్ణంగా చదివి, వాటిని పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
  • అభ్యర్థులు ఆందోళన చెందకుండా, సమయానికి ముందే కేంద్రాలకు చేరుకుని ప్రశాంతంగా పరీక్ష రాయాలని టిటిడి ఇంజినీరింగ్ విభాగం కోరింది.
  • మరింత సమాచారం కోసం లేదా ఏవైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttd-recruitment.aptonline.in/ ను సందర్శించవచ్చు. సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం లేదా ఇతర వివరాల కోసం 155257 అనే కాల్ సెంటర్ నంబర్‌ను సంప్రదించాలని టీటీడీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు వెల్లడించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe