IIT NEET Coaching : విద్యార్థులకు గుడ్ న్యూస్ - విశాఖలో ఉచితంగా ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్..!600 సీట్లు

AP Govt IIT NEET Coaching : గిరిజన విద్యార్థుల కోసం విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసింది. 600 మంది ఎస్టీ విద్యార్థులకు ఐఐటీ-జేఈఈ, నీట్ ఉచిత రీసెర్చ్ కోచింగ్ అందించనుంది.

Published on: Aug 27, 2026, 19:19:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Govt IIT NEET Coaching : గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి, ఉన్నత విద్యలో వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థల్లో ఎస్టీ విద్యార్థులకు సీట్లు దక్కేలా ప్రోత్సహించేందుకు గానూ ప్రత్యేకంగా "సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" (CoE) ఏర్పాటు చేసింది.

ఎస్టీ విద్యార్థులకు గుడ్ న్యూస్
ఎస్టీ విద్యార్థులకు గుడ్ న్యూస్

విశాఖపట్నం కేంద్రంగా శిక్షణ….

విశాఖపట్నం జిల్లా మరికవలసలోని గురుకుల బాలుర పాఠశాల ప్రాంగణంలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను నెలకొల్పారు. దేశంలోని అగ్రగామి విద్యాసంస్థలైన ఐఐటీలు (IITs), నిట్‌లు (NITs), ఎయిమ్స్ (AIIMS), ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థల్లో ప్రవేశాలు సాధించాలనే పట్టుదల కలిగిన గిరిజన విద్యార్థులకు ఉచితంగా ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ ఇవ్వడం ఈ సెంటర్ ముఖ్య ఉద్దేశం.

ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఇంటర్మీడియట్ స్థాయికి చెందిన మొత్తం 600 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో అమ్మాయిలు, అబ్బాయిలకు సమాన అవకాశాలు కల్పిస్తూ 300 మంది బాలురు, 300 మంది బాలికలకు స్థానం కల్పించారు. ప్రతిభ ఆధారంగా నిర్వహించిన పారదర్శక ఎంపిక ప్రక్రియ ద్వారా అర్హులైన 600 మంది ఎస్టీ విద్యార్థులను ఇప్పటికే ఎంపిక చేశారు.

ఎంపికైన విద్యార్థులను విశాఖలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు తరలించే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. అకడమిక్ కార్యక్రమాలు ఎలాంటి అంతరాయం లేకుండా వెంటనే ప్రారంభమయ్యేలా వారి వసతి, రుచికరమైన పోషకాహార భోజనం, ఇతర నివాస ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. విద్యార్థుల కోసం ఆధునిక డిజిటల్ ల్యాబ్‌లు, ఐసీటీ సౌకర్యాలు, నాణ్యమైన ఫర్నిచర్, మెరుగైన మౌలిక సదుపాయాలతో పాటు సబ్జెక్టు నిపుణులైన అధ్యాపకులను నియమిస్తోంది. సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు జాతీయ స్థాయిలో పోటీపడేలా అత్యుత్తమ విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గిరిజన విద్యార్థుల విద్యా, సామాజిక-ఆర్థిక పురోగతికి ఒక కీలకమైన మార్పును తెస్తుందని విద్యావేత్తలు ఆశిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More