నేను కూడా ఒక మారుమూల గిరిజన గ్రామం నుండి వచ్చాను : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
గిరిజన విశ్వవిద్యాలయం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొదించే కేంద్రంగా నిలుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలని నిర్దేశించుకుని ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.
విశాఖపట్నంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా విచ్చేసి డిగ్రీలు పూర్తి చేసిన 373 మంది విద్యార్థులకు పట్టాలను, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మందికి బంగారు పతకాలను అందజేశారు. ఈ సదస్సులో రాష్ట్రపతి ప్రసంగించారు.

పట్టభద్రులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 'నేను కూడా ఒక మారుమూల గిరిజన గ్రామం నుండి చదువుకుని వచ్చిన మొదటి గ్రాడ్యుయేట్‌ను. ఈ రోజు ఇంతమంది గిరిజన, గ్రామీణ యువత ఉన్నత విద్యను పూర్తి చేసుకుని డిగ్రీలు అందుకోవడం చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది.' అని ఆమె పేర్కొన్నారు.
నవభారత, వికాసిత్ భారత్ లక్ష్య సాధనలో విద్యావంతులైన యువత పాత్ర అత్యంత కీలకమని రాష్ట్రపతి నొక్కిచెప్పారు. విద్యార్థులు కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నా.. సమాజంలో వెనకబడిన అట్టడుగు వర్గాలను, పేదలను మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ తమ ఎదుగుదలతోపాటు సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకుని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
జీవితాల్లో మార్పు తెచ్చేదే నిజమైన విద్య: మంత్రి నారా లోకేశ్
ఈ వేడుకలో పాల్గొన్న ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. కేవలం మార్కులు, సర్టిఫికెట్లు సాధించడం మాత్రమే విద్య కాదని, సామాన్యుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే నిజమైన విద్య అని స్పష్టం చేశారు. నాణ్యమైన ఉన్నత చదువులు సమాజంలోని ప్రతి చివరి వర్గానికి, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల యువతకు చేరినప్పుడే సమానత్వం సాధ్యమవుతుందన్నారు.
అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధితోనే వికసిత్ భారత్ కల సాకారం అవుతుందని లోకేశ్ పేర్కొన్నారు. సొంత కృషితో, పట్టుదలతో దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిని అధిరోహించిన ద్రౌపది ముర్ము జీవితమే నేటి విద్యార్థులకు అతిపెద్ద ఆదర్శమని కొనియాడారు. గిరిజన విశ్వవిద్యాలయం విద్యార్థులను రేపటి తరం సమర్థవంతమైన నాయకులుగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు.
ఈ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


