ఏపీలో రూ.915 కోట్ల పర్యాటక ప్రోత్సాహానికి కేంద్రం మద్దతు.. కీలక ప్రతిపాదనలకు ఆమోదం

AP Tourism : ఏపీలో రూ.915 కోట్ల పర్యాటక ప్రోత్సాహానికి కేంద్రం మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైంది. కీలక ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టుగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు.

Published on: Apr 3, 2026, 06:42:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక, సాంస్కృతిక మౌలిక సదుపాయాలను విస్తరించే ప్రయత్నాలల్లో భాగంగా రూ.915 కోట్ల విలువైన పర్యాటక ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తొమ్మిది కొత్త ప్రాజెక్టులను ప్రవేశపెట్టి, పెండింగ్‌లో ఉన్న ఆరు కార్యక్రమాలకు అనుమతి కోరారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఏపీ టూరిజం
ఏపీ టూరిజం

దేవాలయాలు, బీచ్‌లు, వారసత్వ ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి ప్రసాద్, స్వదేశ్ దర్శన్ పథకాల కింద ప్రాజెక్టులు ప్రతిపాదనలు ఉన్నాయి. ముఖ్య ప్రదేశాలు మంగళగిరి, అరసవల్లి, వాడపల్లి, కోరుకొండ, నెల్లూరు, మచిలీపట్నం, లంబసింగి, లేపాక్షి, బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌లతో పాటు రాజమండ్రిలో జాతీయ నాటక పాఠశాల ప్రాంగణాన్ని, అమరావతిలో పర్యాటక భవన్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది.

అమరావతిలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాస్పిటలిటీ అండ్ ఇంటిగ్రేటెడ్ ఎక్స్‌పీరియన్స్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై కూడా చర్చలు జరిగాయి. విశాఖపట్నంలో లలిత్ కళా అకాడమీ, ఆంధ్రప్రదేశ్‌లో సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రాలు, అలాగే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ శాఖ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలకు సానుకూల స్పందన లభించింది.

విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత, నృత్య కళాశాలలో 'కళాక్షేత్ర' ఆడిటోరియం ఏర్పాటుకు కూడా కేంద్రం మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు షెఖావత్. చారిత్రాత్మక 'సూర్యరాయంధ్ర నిఘంటువు' పునర్ముద్రణకు మద్దతు ఇచ్చేందుకు కేంద్ర మంత్రి అంగీకరించారు.

తిరుపతి, విశాఖపట్నాలను అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి, వాటిని భారతదేశంలోని టాప్ 50 పర్యాటక గమ్యస్థానాలలో చేర్చడానికి దుర్గేష్ సహాయం కోరారు. అమలును వేగవంతం చేసేందుకు ఆయన పర్యాటక శాఖ కార్యదర్శి సుమన్ బిల్లా, సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్‌లతో కూడా చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రాజెక్ట్ నివేదికలను అధికారులు అభినందించి, తమ మద్దతు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

'ఇక తెలుగు సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే దిశగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, లలిత కళా అకాడమీ, సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రాల ఏర్పాటు, అలాగే విజయవాడలో కళాక్షేత్ర ఆడిటోరియం నిర్మాణానికి మద్దతు కోరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నుండి సానుకూల స్పందన లభించడం ఆనందదాయకం. రాష్ట్రానికి ఇప్పటికే మంజూరైన రూ.430 కోట్ల ప్రాజెక్టుల పురోగతిని వివరించాను.' అని మంత్రి దుర్గేష్ చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More