ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం మద్దతు ప్రకటించారు. జనాభా ఆధారిత నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వల్ల పార్లమెంటులో తమ ప్రాతినిధ్య వాటా తగ్గుతుందేమోనన్న దక్షిణాది రాష్ట్రాల ఆందోళనకు ఈ నిర్ణయం ఊరటనిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' సూత్రంతో చేపట్టిన చారిత్రక ముందడుగుకు మద్దతుగా తాను ఇక్కడికి వచ్చానని మీడియా సమావేశంలో చంద్రబాబు తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రధానికి అభినందనలు చెప్పారు.
"సబ్కా సాథ్, సబ్కా వికాస్ అనే నినాదంతో గౌరవ ప్రధానమంత్రి తీసుకున్న చారిత్రక కార్యక్రమానికి మద్దతుగా ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను. ఇందులో ముఖ్యంగా మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు ఆయన్ను నిజంగా అభినందిస్తున్నాను. ఈ ప్రక్రియకు నేను ప్రత్యక్ష సాక్షిని, ఆ విషయాలు వివరిస్తాను. ఇప్పుడు అది రూపుదిద్దుకుంటోంది, దేశంలో కొంత ఆశ చిగురిస్తోంది," అని చంద్రబాబు వివరించారు.
దక్షిణాది రాష్ట్రాలకు ఊరట..
ప్రతి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యను 50 శాతం పెంచేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యను స్వాగతిస్తూ, ఈ నిర్ణయం దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద ఉపశమనం కలిగిస్తుందని చంద్రబాబు చెప్పారు.
"ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి ఉన్న సీట్లలో 50 శాతం పెంపునకు శ్రీకారం చుట్టింది. ఇది మనందరికీ ఎంతో ఊరటనిస్తుంది," అని ఆయన అన్నారు.
{{/usCountry}}"ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి ఉన్న సీట్లలో 50 శాతం పెంపునకు శ్రీకారం చుట్టింది. ఇది మనందరికీ ఎంతో ఊరటనిస్తుంది," అని ఆయన అన్నారు.
{{/usCountry}}కుటుంబ నియంత్రణ ద్వారా జనాభా వృద్ధిని తొలి దశలోనే అదుపు చేసినప్పటికీ, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్న ఆందోళన గతంలో ఉండేదని గుర్తు చేశారు.
"నిన్నటి వరకు మనందరిలో ఒక భయం ఉండేది. 1971 జనాభా లెక్కలు, 2011 లెక్కలు లేదా 2026 లెక్కల ప్రకారం చూస్తే, తొలి దశలో మనం కుటుంబ నియంత్రణకు చొరవ తీసుకున్నందున దక్షిణాదికి పెద్ద సమస్య వస్తుందని ఆందోళన పడ్డాం. ఆ రోజుల్లో నేను కూడా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను. రెండున్నర, మూడు దశాబ్దాల క్రితం కుటుంబ నియంత్రణను పెద్ద ఎత్తున ప్రోత్సహించాను," అని చంద్రబాబు పేర్కొన్నారు.
"కుటుంబ నియంత్రణ చేయాలంటే ముందుగా మహిళా అక్షరాస్యత, పేదరిక నిర్మూలన జరగాలని, అప్పుడే జనాభాను నియంత్రించగలమని అందరూ నన్ను అడిగారు. అప్పుడు నేను వాళ్లతో చెప్పాను. ఈ మూడింటినీ సాధించడానికి చాలా సమయం పడుతుంది. వీటిని ఒకేసారి చేపట్టాలి. ఆ ప్రచార పంథానే నేను ఎంచుకున్నాను," అని ఆయన వివరించారు.
ప్రస్తుతం రీప్లేస్‌మెంట్ స్థాయి 2.1 ఉండగా, సంతానోత్పత్తి రేటు 1.6గా ఉన్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాయని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు జనాభా నిర్వహణ అవసరమని, పెద్ద కుటుంబాలకు ప్రోత్సాహకాలు ఇచ్చి ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రజలను ప్రోత్సహించాలని తాను పిలుపునిచ్చినట్లు తెలిపారు.
ABOUT THE AUTHOR
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.