ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి రైతుకూ పూర్తి పారదర్శకతతో భూ హక్కులు కల్పిస్తూ పట్టాదార్ పాస్‌పుస్తకాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 40.5 లక్షల పట్టాదార్ పాస్‌పుస్తకాలను అధికారిక ముద్రతో పంపిణీ చేశామని, రాబోయే రోజుల్లో నెలకు తగిన లక్ష్యాలను నిర్దేశించుకుని మరో 51 లక్షల పాస్‌పుస్తకాలను అందజేస్తామని ప్రకటించారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని నర్సింగోలు గ్రామంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

అక్టోబర్ నెలలోనే 790 గ్రామాల్లో దాదాపు నాలుగు లక్షలకు పైగా పాస్‌పుస్తకాలను పంపిణీ చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. "రైతులు అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదు. మీ భూమికి మీరే యజమానులు. ఎలాంటి భూ వివాదాలకు తావులేకుండా సమగ్ర రీ-సర్వే పూర్తి చేసి పాస్‌పుస్తకాలు ఇస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని భూ వివాదాలను పరిష్కరించి రైతులకు హక్కు పత్రాలు అందజేశారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై సభలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు చంద్రబాబు. తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలకు చెందిన 16.4 లక్షల ఎకరాల భూములను గత పాలకులు నిరోధిత జాబితాలో (సెక్షన్ 22ఏ) పెట్టారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో భూములకు రక్షణ లేకుండా పోయిందని, ప్రజలు ఇళ్లల్లోనూ, బయట కూడా భయంతో బతికారన్నారు.
బీసీ రిజర్వేషన్లు & స్థానిక సంస్థల ఎన్నికలు
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల జీవోను సుప్రీంకోర్టు రద్దు చేసినప్పటికీ, తమ పార్టీ (టీడీపీ) తరఫున బీసీలకు 34 శాతం సీట్లు కేటాయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వం తెచ్చిన 34 శాతం బీసీ రిజర్వేషన్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం 24 శాతానికి తగ్గించిందని, దాన్ని కూటమి ప్రభుత్వం రాగానే మళ్లీ 34 శాతానికి పెంచితే కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) నెపంతో స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేసేందుకు ప్రతిపక్షం కుట్ర చేస్తోందని ఆరోపించారు.
'మీ భూమి - మీ హక్కు', అభివృద్ధి పనులకు శంకుస్థాపన
'మీ భూమి - మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముప్పాళ్ల గ్రామంలో రూ.28 కోట్లతో నిర్మించనున్న వారధి నిర్మాణానికి పునాది రాయి వేశారు. అలాగే రూ.166 కోట్ల వ్యయంతో పోతుల చెంచయ్య పాలేరు జలాశయం ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే ఈ ప్రాంతంలో 9,500 ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా 15 గ్రామాల్లోని 35,000 మందికి తాగునీరు అందుతుందని చంద్రబాబు నాయుడు తెలిపారు.
సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులపై ప్రణాళికలు
{{/usCountry}}'మీ భూమి - మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముప్పాళ్ల గ్రామంలో రూ.28 కోట్లతో నిర్మించనున్న వారధి నిర్మాణానికి పునాది రాయి వేశారు. అలాగే రూ.166 కోట్ల వ్యయంతో పోతుల చెంచయ్య పాలేరు జలాశయం ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే ఈ ప్రాంతంలో 9,500 ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా 15 గ్రామాల్లోని 35,000 మందికి తాగునీరు అందుతుందని చంద్రబాబు నాయుడు తెలిపారు.
సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులపై ప్రణాళికలు
{{/usCountry}}ఇటీవల చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ.. విజయవాడ, విశాఖపట్నం, మంగళగిరి ప్రాంతాల్లో రూ.52,000 కోట్ల విలువైన నివాస స్థలాల హక్కులను 60,000 మందికి కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేశామని, త్వరలోనే మరో ఆరు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. వంశధార నుంచి పెన్నా వరకు 40 చిన్న, పెద్ద నదులను అనుసంధానిస్తూ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని, గోదావరి - కావేరి నదుల అనుసంధానం ద్వారా నాలుగు రాష్ట్రాల నీటి ఎద్దడి తీరుతుందన్నారు. వచ్చే మూడేళ్లలో రూ.35,000 కోట్ల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.