ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్పులు చేసింది. ఇదివరకు ప్రకటించిన పోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీలను సవరిస్తూ బుధవారం అధికారికంగా కొత్త షెడ్యూల్‌ను వెలువరించింది.

మొదటి షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 3న పోలింగ్, 5వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించాల్సి ఉంది. కొత్త షెడ్యూల్ ప్రకారం పోలింగ్ తేదీ వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఓట్ల లెక్కింపు వచ్చే నెల 7వ తేదీకి మార్చింది ఎన్నికల సంఘం. ఇటీవల పట్టణ స్థానిక సంస్థల (మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు) ఎన్నికల తేదీలను సైతం ఎన్నికల సంఘం సవరించిన సంగతి తెలిసిందే.
పట్టణ పోలింగ్‌ను అక్టోబర్ 28 నుంచి వచ్చే నవంబర్ 1వ తేదీకి, ఓట్ల లెక్కింపును అక్టోబర్ 30 నుంచి నవంబర్ 3వ తేదీకి రీషెడ్యూల్ చేసింది. నవంబర్ 3న మునిసిపల్ ఎన్నికల లెక్కింపు జరగాల్సి ఉంది. అదే 3వ తేదీన ముందస్తు ప్రణాళిక ప్రకారం MPTC, ZPTC పోలింగ్ నిర్వహిస్తే పోలీస్ బందోబస్తు, సిబ్బంది కొరత, సమన్వయ లోపం వంటి అడ్డంకులు ఎదురవుతాయని అధికారుల భావించారు. ఈ సమన్వయ సమస్యలను అధిగమించేందుకు పరిషత్ పోలింగ్‌ను 5వ తేదీకి వాయిదా వేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలిపివేయకుండా ముందుకెళ్లాలని, ఎన్నికలను వేగవంతంగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు లోబడి, పారదర్శకంగా, శాంతియుతంగా ఎన్నికలు పూర్తి చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ కసరత్తు చేసింది.
నామినేషన్ల గడువును పొడిగించాలని, ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని వైసీపీ కోరిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపి తుది నిర్ణయం వెలువరించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. "ఎన్నికలను వాయిదా వేయాలనే మీ ఉద్దేశం లేదా ట్రాప్‌లో మేం పడబోం" అని ధర్మాసనం స్పష్టం చేసింది. నామినేషన్ల సమయం ఇప్పటికే ముగిసినందున విచారణను కొనసాగించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. "ఇక ఎన్నికల సమయం వచ్చింది.. పోటీ చేయండి, ఆల్ ది బెస్ట్" అని వ్యాఖ్యానిస్తూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ముగించారు.
ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై స్పందించిన సుప్రీంకోర్టు, పోలింగ్ కేంద్రాల్లో, నామినేషన్ల కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను సురక్షితంగా భద్రపరచాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. భవిష్యత్తులో ఎన్నికల సవాళ్లు లేదా పిటిషన్లు వచ్చినప్పుడు ఈ ఫుటేజ్ సాక్ష్యంగా ఉపయోగపడుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
{{/usCountry}}ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై స్పందించిన సుప్రీంకోర్టు, పోలింగ్ కేంద్రాల్లో, నామినేషన్ల కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను సురక్షితంగా భద్రపరచాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. భవిష్యత్తులో ఎన్నికల సవాళ్లు లేదా పిటిషన్లు వచ్చినప్పుడు ఈ ఫుటేజ్ సాక్ష్యంగా ఉపయోగపడుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
{{/usCountry}}