ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సమయాల్లో ప్రభుత్వం తాత్కాలిక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బూత్ లెవల్ ఆఫీసర్లుగా (BLO) అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ, ఇతర ఎన్నికల సంబంధిత విధుల నిర్వహణలో అంగన్‌వాడీ టీచర్లు చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. దీనివల్ల అటు కేంద్రాల నిర్వహణ, ఇటు బీఎల్‌ఓ విధుల సమన్వయం కష్టతరంగా అవుతోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు, పరిష్కరించడానికి ప్రభుత్వం తాత్కాలికంగా నెల రోజుల పాటు సమయాలను సవరించినట్టుగా ప్రకటించింది.
ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం.. బీఎల్‌ఓ విధుల్లో ఉన్న అంగన్‌వాడీ టీచర్ల కేంద్రాలు మాత్రమే ఇక మీదట ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 03:00 గంటల వరకు పనిచేస్తాయన్న మాట. ఈ కొత్త వేళలు జూన్ 29 నుండి ప్రారంభమై, జూలై 28 వరకు అమలులో ఉంటాయి.
కేవలం ఎన్నికల విధులు ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రమే ఈ సమయ మార్పు వర్తిస్తుంది. మిగిలిన కేంద్రాలు యథావిధిగా పాత వేళల్లోనే నడుస్తాయి. సమయం తగ్గించినా కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు అందించే బాలామృతం, గుడ్లు, పాలు వంటి పౌష్టికాహార పంపిణీకి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
జూన్, జూలై నెలల్లో వర్షాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్న పిల్లల ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమయ మార్పుపై క్షేత్రస్థాయిలో ఉన్న లబ్ధిదారులకు ముందే సమాచారం అందించి అవగాహన కల్పించాలని అంగన్‌వాడీ సూపర్వైజర్లకు ఆదేశాలు వెళ్లాయి.
{{/usCountry}}జూన్, జూలై నెలల్లో వర్షాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్న పిల్లల ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమయ మార్పుపై క్షేత్రస్థాయిలో ఉన్న లబ్ధిదారులకు ముందే సమాచారం అందించి అవగాహన కల్పించాలని అంగన్‌వాడీ సూపర్వైజర్లకు ఆదేశాలు వెళ్లాయి.
{{/usCountry}}ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. మరణించిన వారి పేర్లు, నకిలీ ఓట్లు, వలస వెళ్లిన వారి పేర్లను తొలగించి, కొత్త ఓటర్లను చేర్చడం ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. సర్వే సమయంలో బూత్ లెవల్ అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు వంటి సరైన వివరాలను వారికి అందించాలి.